ETV Bharat / state

హైదరాబాద్‌కు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు: ఎంపీ బండ ప్రకాశ్ - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020

మత విద్వేషాలను రెచ్చగొట్టే భాజపాకు ప్రజలే గుణపాఠం చెప్తారని ఎంపీ బండ ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. బల్దియా ఎన్నికల్లో ఈసారీ సెంచరీ కొట్టి జీహెచ్‌ఎంసీలో గులాబీ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ డివిజన్‌లో పాదయాత్ర చేపట్టిన వీరు తెరాసకే ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.

trs mp banda prakash election campaign at khairatabad for ghmc

author img

By

Published : Nov 27, 2020, 2:03 PM IST

హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ ముదిరాజ్ తెలిపారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపాకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఖైరతాబాద్ డివిజన్‌లో పలు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి పాదయాత్ర చేపట్టిన ఆయన... తెరాసకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.

సీఎం కేసీఆర్ సర్కార్‌తో వెనుకబడిన వర్గాలకు ఆత్మగౌరవం దక్కిందని వారు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాయని... అందుకే ప్రజలు తెరాస పార్టీని గెలిపించుకోవాలని చూస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. బల్దియా ఎన్నికల్లో సెంచరీ కొట్టి ... జీహెచ్ఎంసీలో గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

trs mp banda prakash election campaign at khairatabad for ghmc

ఇదీ చదవండి: ఈసారి తెరాసనే గెలిపిస్తామంటున్నారు : విజయభారతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.