జిల్లా, మండల పరిషత్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. తెలంగాణ భవన్లో ఈనెల 15న మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరిగే భేటీకి పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ సమావేశానికి తెరాస రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు... మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నేతలందరినీ ఆహ్వానించారు.
ఈనెల 22 నుంచి ఎన్నికల ప్రక్రియ
ఈనెల 22 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం సిఫార్సు చేసిన నేపథ్యంలో... పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర స్థాయి నేతల నుంచి గ్రామస్థాయి కార్యకర్తల వరకు అందరూ సమష్టిగా కష్టపడి పనిచేశారని కేసీఆర్ సంతృప్తిగా ఉన్నారు.
గులాబీ జెండా ఎగరాలి
ఇదే ఒరవడి జిల్లా, మండల పరిషత్‌లలో కొనసాగించి గులాబీ జెండా ఎగరవేయాలని తెరాస నాయకత్వం భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల మాదిరిగానే జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులను ముందుకు నడిపించే కీలక బాధ్యతను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేపట్టనున్నారు.
ఇవీ చూడండి: మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు!