ETV Bharat / state

మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించిన అధికార పార్టీ కౌన్సిలర్​

తహసీల్దార్, మున్సిపల్, పోలీస్ అధికారుల నుంచి ప్రాణహాని ఉందంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు మహబూబాబాద్ 8వ వార్డ్ కౌన్సిలర్ బానోతు రవి ఫిర్యాదు చేశారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిషన్​ను రవి వేడుకున్నారు.

author img

By

Published : Aug 13, 2020, 3:57 PM IST

trs counsellor meet human rights commission
మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించిన అధికార పార్టీ కౌన్సిలర్​

మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ అధికారులు తనపై అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారని... రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో మహబూబాబాద్ 8వ వార్డు తెరాస కౌన్సిలర్ బానోతు రవి ఫిర్యాదు చేశారు. కొంతమంది స్థానిక తెరాస నాయకులు... తహసీల్దార్, మున్సిపల్, పోలీస్​ అధికారులు కలిసి తనపై అక్రమ కేసులు పెట్టించారని పేర్కొన్నారు. గత జనవరిలో జరిగిన మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రవి గెలుపొందారు. అనంతరం తెరాస పార్టీలో చేరినట్లు తెలిపారు. అప్పటినుంచి పలువురు రాజకీయ నాయకులు కక్షగట్టి.. ప్రభుత్వ భూమిలో 5 ఏళ్లుగా ఇల్లు నిర్మించుకొని ఉన్న తన వార్డులోని ప్రజల ఇల్లు కూలగొట్టిన కేసులో తన పేరును చేర్చి అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని రవి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ సంఘటన జరిగిన సమయంలో తాను హైదరాబాద్‌లో ఉన్నానని రవి వివరించారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను హెచ్ఛార్సీకి చూపించారు. తనపై కక్షపూరితంగా కేసులు పెట్టి బెదిరింపులకు గురిచేస్తున్నారని రవి ఆరోపించారు. తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. బాధ్యులైన చర్యలు తీసుకోవాలని హెచ్ఛార్సీని రవి కోరారు. అలాగే తనపై పెట్టిన కేసులను రద్దు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్​కు విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: తండ్రిని కొట్టి చంపిన తనయుడు.. కారణమిదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.