ETV Bharat / state

ముగ్గురు ఐఏఎస్​ల బదిలీ.. రఘనందన్​ రావుకు పోస్టింగ్​

ముగ్గురు సీనియర్​ ఐఏఎస్​ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమేశ్​కుమార్​ను రెవెన్యూ శాఖ, రాజేశ్వర్​ తివారిని అటవీ శాఖకు బదిలీ చేశారు. నిరీక్షణలో ఉన్న రఘనందన్​ రావును పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి కమిషనర్​గా నియమించింది. ఇదే స్థానంలో ఉన్న నీతూకుమారి ప్రసాద్​కు పోస్టింగ్ ఇవ్వలేదు.

ముగ్గురి ఐఏఎస్​ల బదిలీ
author img

By

Published : Aug 19, 2019, 4:13 AM IST

Updated : Aug 19, 2019, 7:21 AM IST

ముగ్గురి ఐఏఎస్​ల బదిలీ.. రఘనందన్​ రావుకు పోస్టింగ్​

రేపు, ఎల్లుండి కలెక్టర్ల సమావేశాల నేపథ్యంలో ముగ్గురు సీనియర్​ ఐఏఎస్​ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్​ తివారికి అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా స్థానచలనం కల్పించింది. ప్రస్తుతం ఆబ్కారీ, వాణిజ్య పన్నుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నసోమేశ్​ కుమార్​కు రెవెన్యూ శాఖను అప్పగించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు కూడా ఆయనకే ఉంటాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్​గా, రెరా ఛైర్మన్​గా సోమేశ్​ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి శాఖల కమిషనర్​ నీతూకుమారి ప్రసాద్​కు​ స్థానచలనమయింది. ఆమె స్థానంలో నిరీక్షణలో ఉన్న రఘునందన్​ రావు నియమితులయ్యారు. నీతూ​కుమారి ప్రసాద్​కు పోస్టింగ్ ఇవ్వలేదు.

ఇవీ చూడండి : కామాంధుడు... మనవరాలినీ వదల్లేదు

Last Updated : Aug 19, 2019, 7:21 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.