ETV Bharat / state

హైదరాబాద్​ వాసులకు అలర్ట్ - ఆ మార్గాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు - MRPS public meeting in Secunderabad

Traffic Restrictions in Hyderabad Today : హైదరాబాద్‌లో ఈరోజు పలుచోట్ల ట్రాఫిక్​ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఉండనున్నాయి. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

Traffic restrictions in Hyderabad today
Traffic restrictions in Hyderabad today
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 11, 2023, 11:48 AM IST

Traffic Restrictions in Hyderabad Today : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నేడు హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో.. ఎమార్పీఎస్‌​ నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 2:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు పలుచోట్ల ట్రాఫిక్‌ మళ్లింపు, ఆంక్షలు ఉంటాయని నగర అదనపు (ట్రాఫిక్‌) పోలీసు కమిషనర్‌ జి.సుధీర్‌బాబు వెల్లడించారు.

కార్తికమాసం స్పెషల్ - శైవ క్షేత్రాలకు తెలంగాణ ఆర్టీసీ బస్సులు

  • బేగంపేట నుంచి సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్, పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్ వరకు.. టివోలి ఎక్స్‌ రోడ్స్, ప్లాజా ఎక్స్‌ రోడ్ల మధ్య రహదారులను మూసివేయనున్నారు.
  • సికింద్రాబాద్‌ సంగీత్‌ కూడలి నుంచి బేగంపేట వైపు వచ్చే వాహనాలను.. వైఎంసీఏ వద్ద క్లాక్‌ టవర్, ప్యాట్నీ, సీటీఓ, సీటీఓ, బేగంపేట రసూల్‌పురా వైపు మళ్లించనున్నారు.
  • బేగంపేట నుంచి సంగీత్‌ కూడలికి వచ్చే ట్రాఫిక్‌ను.. సీటీఓ ఎక్స్‌ రోడ్స్‌ వద్ద బాలంరాయ్, టివోలి, స్వీకార్‌ ఉప్‌కార్, బ్రూక్‌బాండ్, వైఎంసీఏ, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, సంగీత్‌ ఎక్స్‌ రోడ్ల వైపు పంపిచనున్నారు.
  • తాడ్‌బండ్‌ , బోయిన్‌పల్లి నుంచి టివోలి వైపు వచ్చే వాహనాలను బ్రూక్‌ బాండ్‌ వద్ద సీటీఓ, ట్యాంక్‌బండ్‌, రాణిగంజ్ వైపు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.
  • ఏబీఎస్‌, కార్ఖానా నుంచి ప్యాట్నీ-ఎస్‌బీహెచ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను.. స్వీకార్‌-ఉప్‌కార్‌ వద్ద వైఎంసీఏ, క్లాక్‌ టవర్, ప్యాట్నీ లేదా బ్రూక్‌బాండ్‌-టివోలి, సీటీవో, బాలంరాయ్ వైపు మళ్లాలని పేర్కొన్నారు.
  • ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలను.. ఎస్‌బీహెచ్‌- స్వీకార్‌-ఉప్‌కార్‌ వైపు అనుమతిలేదని చెప్పారు. వైఎంసీఏ, క్లాక్‌ టవర్‌ లేదా సీటీఓ, ప్యారడైజ్ వైపు పంపించనున్నారు.
  • ఆర్టీఏ కార్యాలయం (తిరుమలగిరి), సఫిల్‌గూడ, కార్ఖానా, మల్కాజిగిరి నుంచి ప్లాజా వైపు వచ్చే వాహనాలను.. టివోలి వద్ద స్వీకార్‌-ఉప్‌కార్, వైఎంసీఏ లేదా బ్రూక్‌ బాండ్, బాలంరాయ్, సీటీఓ వైపు ప్రయాణించాలని పేర్కొన్నారు.
  • జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి బేగంపేటవైపు వచ్చే ట్రాఫిక్‌ను.. పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్, గ్రీన్‌ల్యాండ్‌ రాజ్‌భవన్‌ వైపు పంపించనున్నారు.

PM MODI Schedule Today : సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో.. ఎమార్పీఎస్‌ నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. సాయంత్రం 4:45 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని.. 5:00 గంటలకు పరేడ్ మైదానంలో జరిగే సభకు చేరుకుంటారు. 5:45 గంటలకు వరకు అక్కడ ఉండనున్నారు. సభ అనంతరం ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.

PM Modi Hyderabad Tour Today : మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కేంద్ర బలగాలు పరేడ్ మైదానం పరిసర ప్రాంతాలను.. తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఢంకా భజాయించి చెబుతున్నా బీఆర్​ఎస్ ఓటమి ఖాయం : ప్రధాని మోదీ

'మహాదేవ్‌ పేరునూ కాంగ్రెస్​ వదిలిపెట్టలేదు'- బెట్టింగ్ యాప్ కుంభకోణంపై ప్రధాని మోదీ ధ్వజం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.