ETV Bharat / state

నిబంధనలు ఉల్లంఘిస్తే... జరిమానాలు తప్పవు - ట్రాఫిక్​ పోలీసులు

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాళ్లను గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగించుకుంటున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద అధునాతన కెమెరాలను ఏర్పాటు చేశారు. కృత్రిమ మేథస్సుతో పనిచేసే ఈ కెమెరాలు వాహనాలను ఇట్టే కనిపెడతాయి.

traffic-police-use-updated-technology-for-challan
నిబంధనలు ఉల్లంఘిస్తే... జరిమానాలు తప్పవు
author img

By

Published : Dec 2, 2020, 1:28 PM IST

హైదరాబాద్ మహానగరంలో వాహనాల రద్దీ రోజురోజుకు పెరిగిపోతోంది. ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. వాహనాల సంఖ్య పెరగడం ఒక ఎత్తైతే... నిబంధనలు పాటించకుండా ఎలా పడితే అలా రహదారులపై పోయే వాహనదారుల వల్ల సమస్య రెట్టింపవుతోంది. కూడళ్ల వద్ద వాహనాలు ఆపకుండా అలాగే వెళ్లడం.. జీబ్రా లైన్ దాటి ముందుకు వచ్చి పాదచారులు వెళ్లడానికి ఇబ్బందులు సృష్టించడం.. ఫ్రీ లెఫ్ట్ దారుల్లో వాహనాలను ఆపి ఉంచడం వంటి కారణాల వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి.

చలాన్లు విధిస్తున్నారు...

ఇలాంటి వాహనదారులను గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమీకృత ట్రాఫిక్ నిర్వహణ విధానం ద్వారా ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా 20వేల అధునాతన కెమెరాలను ఏర్పాటు చేయగా.. అందులో 262 ఆటోమెటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలు బిగించారు. దీని వల్ల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజుకు 2వేల చలాన్లు విధిస్తున్నారు. రాంగ్ రూట్‌లో రావడం, సిగ్నల్ పడినా అలాగే వెళ్లడం, జీబ్రా లైన్ దాటి ముందుకు వెళ్లడం లాంటి నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే ఏఎన్​పీఆర్ కెమెరాల సాయంతో పోలీసులు బంధిస్తారు. ఆధారాలతో సహా ఇంటికి చలాన్ పంపిస్తారు.

నివేదికలు ఏమంటున్నాయంటే...

కూడళ్ల వద్ద, ఇతర ప్రధాన రహదారుల వద్ద ట్రాఫిక్ పోలీసులు ఎవరూ లేరని భావించి వాహనదారులు ఇష్టారీతిన వెళ్తే ఇక అంతే సంగతులు. అధునాతన సీసీ కెమెరాలు 24గంటల పాటు వాహనదారులను కనిపెడుతూనే ఉంటాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది సమీకృత ట్రాఫిక్ నిర్వహణ విధానం ద్వారా వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి కొన్ని రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గినట్లు ట్రాఫిక్ పోలీసుల నివేదికలు చెబుతున్నాయి. కూడళ్ల వద్ద ఉన్న స్టాప్ లైన్‌ను దాటి ముందుకు వచ్చే వాహనాల సంఖ్య... 2018లో 2.2లక్షల వాహనాలుండగా... 2019లో 1.7 లక్షల వాహనాలున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ వరకు 32వేల వాహనాలు స్టాప్ లైన్ నిబంధన పట్టించుకోకుండా ఉల్లంఘించినట్లు ఏఎన్​పీఆర్​ కెమెరాల ద్వారా గుర్తించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్‌లో కూడా 2018లో లక్షా 27వేల వాహనాలుండగా.. 2019లో 2లక్షల 7వేల వాహనాలున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ వరకు లక్షా 32వేల వాహనాలున్నాయి. సిగ్నల్ జంపులు 2018లో 18వేల కేసులు నమోదు కాగా.. 2019లో 35వేల వాహనాలు నిబంధనలు ఉల్లంఘించాయి. ఈ ఏడాది 24వేల వాహనాలున్నాయి. నో ఎంట్రీ మార్గంలో వెళ్లే వాహనాలు 2018లో 96వేలుండగా... గతేడాది 90వేల వాహనాలు, ఈ ఏడాది 17వేల వాహనాలు మాత్రమే ఉన్నాయి.

నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల్లో బాధ్యత పెంచేలా.. ట్రాఫిక్ పోలీసులు చేపడుతున్న చర్యలు కొంతమేర ఫలితాలనిస్తున్నాయి. నగర పౌరులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని పోలీసులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్​ సభతో నగరంలో ట్రాఫిక్​ ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.