Revanthreddy fire On Central: నేషనల్ హెరాల్డ్‌లో ఆర్థిక అవకతవకలు, అక్రమాలు జరగలేదని కేంద్రమే 2015లో చెప్పిందని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకే మళ్లీ కేసును తిరగదోడారని ఆరోపించారు. జాతీయ సమగ్రత కోసం నేషనల్ హెరాల్డ్ పత్రిక నడుపుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు.
యంగ్ ఇండియా ట్రస్ట్ ద్వారా నేషనల్ హెరాల్డ్ పత్రిక నడుపుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. పదవీ త్యాగాలకు మారుపేరు సోనియా, రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఈడీ విచారణ పేరుతో సోనియా, రాహుల్‌ను కించపరచాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. గాంధీ కుటుంబానికి కష్టం వస్తే మనందరికీ కష్టం వచ్చినట్లేనని ప్రతి కార్యకర్త స్పందించాలని సూచించారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ ఆస్తులు విషయంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగనప్పటికీ ఈడీ సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చి భయపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ శ్రేణులంతా శాంతియుత నిరసన వ్యక్తం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ సోమవారం ఈడీ కార్యాలయానికి వెళ్లి బయటకు వచ్చేంత వరకు ఈడీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయాలన్నారు. రైతు రచ్చబండ కార్యక్రమాలు ఈ నెల 21వరకు చేయాల్సి ఉండగా.. మరో 15 రోజులు పొడిగించి జూలై 7 వరకు నిర్వహిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణలోనే పోటీ చేస్తారు. కేసీఆర్‌ను జాతీయ నేతలు ఎవరూ విశ్వసించరు. జాతీయ రాజకీయాల్లోకి పోవాలనుకుంటే ఏపీ ఉపఎన్నికల్లో పోటీ చేయాలి.నెల్లూరు జిల్లాలోని ఉపఎన్నికలో కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో తన పాత్ర పెద్దది చేసి చూపడానికే జాతీయ పార్టీ నినాదం.
- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
భాజపా కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 13న ఏఐసీసీ కార్యాలయం నుంచి ఈడీ ఆఫీసు వరకు రాహుల్ గాంధీ పాదయాత్రగా ర్యాలీతో వెళ్తారని తెలిపారు. అదే రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని ఈడీ కార్యాలయాల ముందు నిరసనలకు ఏఐసీసీ పిలుపునిచ్చిందన్నారు. అందులో భాగంగానే ఈ నెల 13న నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో నల్ల దుస్తులు నల్ల కండువాలు ధరించిన నిరసనలో పాల్గొంటామని తెలిపారు. అదే విధంగా ఈ నెల 15వ హైదరాబాద్ బచావో నినాదంతో హైదరాబాద్ నగర శాంతిభద్రతలపై కాంగ్రెస్ అధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
అత్తారింటికి దారేదిలో బ్రహ్మనందంలా కేసీఆర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూస్తే అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం గుర్తుకొస్తున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఉనికిలేనప్పుడు పొత్తు పెట్టుకుంటానని తమ నేతల కాళ్లు ఎందుకు పట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను ఒక మాయల పకీరు అంటూ అభివర్ణించారు. జాతీయ రాజకీయాల్లోకి పోవాలనుకుంటే పక్క రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో జరిగే ఉప ఎన్నికలో కేసీఆర్ అభ్యర్థిని నిలబెట్టాలని సవాల్ విసిరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన పాత్రను పెద్ది చేసి చూపడానికే కేసీఆర్ జాతీయ పార్టీ నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణలోనే పోటీ చేస్తారని రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను జాతీయ నేతలు ఎవరూ విశ్వసించరని.. జాతీయ రాజకీయాల్లోకి పోవాలనుకుంటే ఏపీ ఉపఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
శాంతిభద్రతలపై అఖిలపక్ష సమావేశం: హైదరాబాద్‌లో 10 రోజుల్లో 8 మంది మైనర్లపై అత్యాచారాలు జరిగాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారంపై కేసీఆర్ నోరేందుకు మెదపలేదని ప్రశ్నించారు. ఈ నెల 15న హైదరాబాద్ శాంతి భద్రతలపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో బచావో నినాదంతో అఖిలపక్ష సమావేశం నిర్వహించునున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, కోశాధికారి సుదర్శన్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
KTR in Khammam Tour : 'దేశంలో ఈ పరిస్థితులకు కారణమెవరు..?'
9 రోజుల్లోనే ఎవరెస్టు బేస్ క్యాంప్‌కు.. ఏడేళ్ల బాలిక సాహసం!