Ponnala Laxmaiah On PM Modi: తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఒప్పుకున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా.. బడ్జెట్‌పై ధన్యవాదాల తీర్మానం రాజకీయాలకు వేదికగా మార్చడం దురదృష్టకరమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. చప్పట్లు కొడితే, దీపాలు వెలిగిస్తే కరోనా ఆగిందా? అని ఎద్దేవా చేశారు. చిన్న, సన్నకారు రైతులకు భాజపా చేసిన మేలేమిటని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని మోదీ చెబుతున్నారు చాలా సంతోషం. భాజపా కూడా మద్దతు పలికింది.. కాదనలేదు. కానీ కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ రాలేదని ఎగతాళి చేస్తున్నారు. మరి కాంగ్రెస్ ఇచ్చిందని మీ స్థానికులకు ఓసారి చెప్పండి... మరి వాళ్లేమి మాట్లాడతారో చూద్దాం. మీరు పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు పలికింది వాస్తవం కాదా..? మీరు పోటీచేస్తే వంద స్థానాల్లో డిపాజిట్లు రాలేదు. మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది. 2020లో భాజపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ మూడు రాష్ట్రాల్లో భాజపా అధికారంలోకి వచ్చిందా..?
- పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు
ఇదీ చూడండి : విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి: మోదీ