ETV Bharat / state

TPCC Cheif Revanth Reddy Chitchat in Hyderabad : "కాంగ్రెస్‌ వేవ్‌ను ఆపడం ఎవరి తరం కాదు.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పనైపోయింది"

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 2, 2023, 5:02 PM IST

TPCC Cheif Revanth Reddy Chitchat in Hyderabad : రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం పనైపోయిందని టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 25 సీట్లు దాటే అవకాశం కూడా లేదని ధీమా వ్యక్తం చేశారు.

TPCC Cheif Revanth Reddy
TPCC Cheif Revanth Reddy Chitchat in Hyderabad

TPCC Cheif Revanth Reddy Chitchat in Hyderabad : కాంగ్రెస్‌ వేవ్‌ను ఆపడం ఎవరి తరం కాదని.. కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Cheif Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ భయంతో ఉచిత సిలిండర్లు, సన్న బియ్యం రేషన్, రైతులకు పెన్షన్‌లాంటి హామీలు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పనైపోయిందని.. ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరని తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో రేవంత్ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్‌లో టికెట్ల ప్రకటన సెంట్రల్‌ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాత ఉంటుందని తెలిపారు. టికెట్ల ప్రకటన నాటికి చాలా మంది బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరతారని వివరించారు.

Revanth Reddy Fires on PM Modi : 'ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వలేదు'

TPCC Cheif Revanth on Joining in Congress : బీఆర్‌ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు మా పార్టీలోకి వస్తున్నారంటేనే తమ బలమెంటో అర్థమవుతుందన్నారు. బీఆర్‌ఎస్‌కు 25 సీట్లు దాటే అవకాశం కూడా లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 19 శాతం ఓట్లు అన్‌డిసైడ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇందులో మెజారిటీ ఓటు షేర్ మాకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సౌత్, నార్త్ ఓట్ పల్స్‌కు చాలా తేడా ఉంటుందని తెలిపారు. దక్షిణాన వ్యక్తిగత ఓటింగ్ ఎక్కువ ఉంటుందన్నారు. కాంగ్రెస్‌లో బీసీ ఆశావాహుల కోసం పీసీసీ అధ్యక్షునిగా తాను కొట్లాడతానని స్పష్టం చేశారు. సర్వేలో ఓసీల కంటే బీసీలకు 2 శాతం తక్కువ ఉన్నా.. బీసీలకే టికెట్‌ (Congress MLA Tickets) ఇస్తామని తెలిపారు. తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీసీలు అడగడంలో తప్పులేదని అన్నారు. బీఆర్ఎస్ బీసీలకు ఇచ్చిన సీట్ల కంటే మేము ఎక్కువ ఇస్తామని వెల్లడించారు.

Revanth Reddy Letter to CM KCR : 'ఒక్క సంతకంతో రెగ్యులర్ చేస్తామన్న హామీ ఏమైంది?'

Revanth Reddy On Modi Tour in Palamuru : ప్రధాని మోదీ పాలమూరు పర్యటనపై టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి (Revanth Reddy Comments on PM Modi Tour) మాట్లాడారు. పాలమూరు సభలో ప్రధాని ఏవైనా పథకాలు, కార్యక్రమాలు ప్రకటిస్తారని అనుకున్నామని తెలిపారు. పాలమూరుకు ఒక భారీ పరిశ్రమనైనా ప్రకటిస్తారు అనుకున్నామని కానీ ఆయన.. పసుపు బోర్డు కొత్తగా ఇస్తున్నట్లు ప్రకటించారని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ సభకు (PM Modi Tour in Palamuru) హాజరుకాని బీజేపీ నాయకుల గురించి ప్రస్తావించారు. తెలంగాణ పట్ల ప్రధాని మోదీ వివక్షత చూపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్‌ సర్కార్‌ అవినీతి చేస్తుందని ఆరోపించే మీరు... చర్యలు మాత్రం ఎందుకు తీసుకోరని నిలదీశారు. కేసీఆర్‌ దోపిడీలో మోదీకి కూడా వాటా ఉందని ఆరోపించారు. మోదీ పర్యటనలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే అని రేవంత్ మండిపడ్డారు.

Gandhi Jayanti Telangana 2023 : 'గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలు ప్రతిరూపాలు'

Revanthreddy Chitchat on CWC Meetings Security : రాష్ట్ర డీజీపీని కలిసిన రేవంత్​రెడ్డి.. కాంగ్రెస్​ సమావేశాలకు భద్రత కల్పించాలని వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.