ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @9AM

ఇప్పటివరకు ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్​
author img

By

Published : Feb 7, 2022, 9:03 AM IST

  • ప్రమాదాలకు అడ్డాగా మారుతున్న పై వంతెనలు..

SHAIKPET FLYOVER ACCIDENTS : భాగ్యనగరంలో పైవంతెనలు దూరాలను దగ్గర చేస్తున్న మార్గాలు. ట్రాఫిక్‌ ఇబ్బందుల్లేకుండా సాఫీ ప్రయాణాన్ని సుగుమం చేస్తున్నాయి. అయితే అధికార యంత్రాంగం ఉదాశీనత, వాహనదారుల నిర్లక్ష్యం రహదారి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. హైదరాబాద్‌లోనే రెండో పొడవైన షేక్‌పేట్‌ ఫ్లైఓవర్​ను గత నెల 1న ప్రారంభించారు.

  • గ్రామ రెవెన్యూ వ్యవస్థకు మరమ్మతులు

Telangana Village Revenue System : రాష్ట్రంలో వీఆర్వో, వీఆర్​ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంపై పరిశీలన జరుగుతోంది. రెవెన్యూ శాఖలో కీలకమైన గ్రామ రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చేందుకు జరుగుతున్న కసరత్తులో భాగంగా.. దీనిపై అధ్యయనం చేయడానికి సర్కార్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

  • కాళ్ల పారాణి ఆరకముందే.. 9 మంది దుర్మరణం

Anantapur Accident Updates : విషాద వార్త విన్న పచ్చటి తోరణాలు వాడిపోయాయి. అప్పటి దాకా మోగిన భాజాభజంత్రీలు.. ఒక్కసారిగా మూగబోయాయి. ఆనందంతో సాగిన చిందులు.. ఆగిపోయాయి. మోముల్లో చిరునవ్వు చెదిరిపోయింది. పెళ్లి ముగించుకుని మొదలైన తిరుగు ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. పెళ్లి కుమార్తె కాళ్లపారాణి ఆరకముందే.. తండ్రి లేడన్న విషయం ఆమె కళ్లలో కన్నీటి సుడులు నింపింది.

  • నువ్వు లేక నేనూ లేను.. చావు లోనూ నీకు తోడుగా ..

Newly Married Couple Commit Suicide: క్షణికావేశం నవ దంపతుల ప్రాణాలు బలి తీసుకుంది. భార్య మరణ వార్త విన్న భర్త ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో జరిగింది. దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన నలభై రోజుల్లోనే బలవన్మరణాలకు పాల్పడటంతో వారిద్దరి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.

  • 'అన్ని వేరియంట్లకు ఒకే టీకా'.. భారత శాస్త్రవేత్తల ఘనత

Corona Vaccine: కరోనా వైరస్​ అన్ని వేరియంట్లకు ఒకే టీకాను అభివృద్ధి చేశారు భారత శాస్త్రవేత్తలు. ఈ టీకాకు 'అభిఎస్‌సీవో వ్యాక్‌' అని పేరు పెట్టారు. ఇది కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2తోపాటు ఆ తరగతికి చెందిన ఆరు వైరస్‌లపై సమర్థంగా పనిచేస్తుందని చెప్పారు.

  • బ్రిటిష్‌ హిట్లరిజం..70 మంది రైతులను చంపిన వైనం

మనిషిలోని మృగత్వానికి యూదులపై హిట్లర్‌ అకృత్యాలను నేటికీ సాక్ష్యంగా చూపుతుంది బ్రిటిష్‌ ప్రభుత్వం. కానీ హిట్లర్‌కు ఏమాత్రం తగ్గకుండా అలాంటి దారుణ వైఖరినే భారతీయులపైనా ప్రదర్శించింది బ్రిటిష్‌ సర్కారు. కేరళలో 70 మంది రైతులను ఓ రైలు బోగీలో ఊపిరాడకుండా కుక్కి చంపిన వైనం అందుకు నిదర్శనం.

  • 15 ఏళ్లుగా జైలులోనే.. అయినా నలుగురు శిశువులకు జన్మ!

Man giving birth from prison: అతనో ఖైదీ... 15 ఏళ్లు జైలులోనే మగ్గిపోయాడు... అదే సమయంలో బయట ఉన్న తన భార్యతో కలిసి నలుగురు పిల్లలకు జన్మనిచ్చాడు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అదే మ్యాజిక్కు... అసలు కథేంటంటే?

  • 'విమాన ఇంధనంపై మండలిదే తుది నిర్ణయం'

Gst on aviation turbine fuel: విమాన ఇంధనాన్ని వస్తుసేవల పన్ను జీఎస్​టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని వచ్చే జీఎస్‌టీ మండలి సమావేశంలో ప్రభుత్వం చర్చకు తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. పరిశ్రమ సంఘం అసోచామ్‌తో బడ్జెట్‌ అనంతరం చర్చలో ఆమె మాట్లాడారు. జీఎస్‌టీలోకి ఏటీఎఫ్‌ను తీసుకురావడంపై మండలి తుది నిర్ణయం తీసుకుంటుందని ఆమె వెల్లడించారు.

  • బోపన్న జోడీదే టైటిల్

టాటా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న-రామ్‌కుమార్‌ రామనాథన్‌ టైటిల్‌ గెలుచుకున్నారు. పుణెలో ఆదివారం హోరాహోరీగా జరిగిన డబుల్స్‌ ఫైనల్లో బోపన్న-రామ్‌కుమార్‌ 6-7 (10-12), 6-3, 10-6తో ల్యూక్‌ సావిల్లె-జాక్‌ ప్యాట్రిక్‌ (ఆస్ట్రేలియా)పై పోరాడి గెలిచారు.

  • పవన్ మరో సినిమా.. ఈసారి వైష్ణవ్​తో మల్టీస్టారర్!

Pawan kalyan movies: రీఎంట్రీలో దూకుడు చూపిస్తున్న పవన్.. ఆరో సినిమాను అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇందులో మేనల్లుడితో కలిసి తెర పంచుకోనున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.