ETV Bharat / state

టాప్​ టెన్​ న్యూస్​@1PM - top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS AT 1PM
టాప్​టెన్​ న్యూస్​@1PM
author img

By

Published : Sep 20, 2020, 12:56 PM IST

1. 'రాష్ట్రాల హక్కులను హరించేలా కొత్త వ్యవసాయ చట్టం'

వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేలా కేంద్రం బిల్లులు తీసుకొస్తోందని రాజ్యసభలో తెరాస ఎంపీ కె.కేశవరావు మండిపడ్డారు. రాజ్యాంగానికి విరుద్ధంగా బిల్లుల రూపకల్పన జరిగిందని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి...

2. చైనాలో మరో వ్యాధి..

చైనాలో మరో వ్యాధి వెలుగులోకి వచ్చింది. వేలాది మంది ప్రజలకు ఈ వ్యాధి సోకినట్లు అధికారులు నిర్ధరించారు. బాధితులకు తలనొప్పి, కండరాల నొప్పులు, జ్వరం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని లక్షణాలు దీర్ఘకాలం పాటు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

3. రాజ్యసభలో వాడీవేడి చర్చ

కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకంగా ఉన్నాయంటూ తెరాస ఎంపీలు విమర్శించారు. రాష్ట్రాల హక్కులను కాలరాసేలా ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి..

4. సాగర్​కు భారీ వరద..

నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్​కు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఇన్​ఫ్లోగా 2 లక్షల 79 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఫలితంగా సాగర్ జలాశయం 16 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి స్పిల్ వే నుంచి 2 లక్షల 37 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి..

5. గూడ్స్‌ బండీ... కొత్తగా మారెనండీ!

మనకెప్పుడూ గూడ్సు రైలంటే చిన్నచూపే! కానీ కరోనా వేళ ఆ గూడ్సు రైలే దేశవ్యాప్తంగా ఆహారం కొరత రాకుండా చూసుకుంది. ఇందుకోసం తన రూపాన్నీ మార్చుకుని, వేగాన్నీ పెంచుకుంది. ఫలితంగా కరోనా వేళ దేశంలో మరే సరకు రవాణా సంస్థ అందుకోనన్ని లాభాల్ని సొంతం చేసుకుంది. దీని వెనక ఆయా రైల్వే డివిజన్‌లు చేపట్టిన వినూత్న ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. ఆసక్తికరమైన ఆ విశేషాలేమిటో చూద్దామా!...

6. పల్టీకొట్టిన వోల్వో కారు..

వోల్వో కారు వేగంగా వచ్చి కరెంట్​ పోల్​ను ఢీకొట్టింది. అంతే కారు ఒక్కసారిగా పల్టీ కొట్టి పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరికి తీవ్రంగా గాయాలయినట్లు తెలిసింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పరిధిలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి..

7. మగబిడ్డ కోసం భార్య గర్భాన్ని కోసి..

భార్య గర్భాశయన్ని కోసి పుట్టబోయే బిడ్డకు లింగనిర్ధరణ చేశాడో కిరాతకుడు. వంశోద్ధారకుడి కోసం ఆరోసారి గర్భందాల్చిన ఆలిని అగచాట్లు పెట్టాడు. మానవత్వం మరచి మృగంలా ప్రవర్తించిన ఆ ఉన్మాదిని అరెస్ట్ చేశారు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి..

8. 'కెనాల్ మ్యాన్​'కు చిరుకానుక..

బిహార్​లోని గయాకు చెందిన లాంగీ భుయాన్ గుర్తున్నాడా? లాంగీ కష్టానికి చలించిన ఆనంద్ మహీంద్రా.. ఆయనకు చిరుకానుక అందజేశారు. ఉచితంగా మహీంద్ర ట్రాక్టర్​ను బహుమతిగా పంపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి...

9. ముంబయి ఇండియన్స్​ నైజం ఇదే..

ఎవరైనా తొలి అడుగు నుంచే విజయపథం వైపు నడవాలని కోరుకుంటారు. కానీ ఈ క్రికెట్ జట్టు అభిమానులు మాత్రం అందుకు భిన్నం. మొదటి మ్యాచ్ ఓడిపోతే ఇక కప్ మనదే అనే రేంజ్​లో సంబరాలు చేసుకుంటారు. ఇదేం చిత్రమైన కోరిక అనిపించినప్పటికీ కొన్నేళ్లుగా ఆ జట్టు ప్రస్థానం చూస్తే వాళ్లనుకునేది నిజమేనని స్పష్టమౌతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి..

10. 'పాయల్​తో అలా ప్రవర్తించలేదు'

నటి పాయల్​ ఘోష్​ తనపై చేసిన లైంగిక ఆరోపణలపై బాలీవుడ్​ దర్శకనిర్మాత అనురాగ్​ కశ్యప్​ స్పందించాడు. ఆమె చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ట్విట్టర్​లో వెల్లడించాడు. తనతో పనిచేసిన ఏ మహిళా కళాకారులతోనూ తాను ఆ విధంగా ప్రవర్తించలేదని స్పష్టం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.