కరోనా బాధితుల కోసం నేడు నిర్వహించాల్సిన ప్రత్యేక ఎంసెట్, ఈసెట్ వాయిదా పడింది. సుమారు 60 మంది విద్యార్థులు కరోనా బారిన పడినందున.. గతంలో ఎంసెట్, ఈసెట్ రాయలేక పోయారు. వారి కోసం నేడు నిర్వహించ తలపెట్టిన ఎంసెట్‌ను వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు. పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపోయారు. అయితే ఎంసెట్ ఫలితాలను ఈ నెల 6న విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ప్రజాప్రతినిధులతో రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం