రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు, ఎల్లుండి మాత్రం పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని పేర్కొంది. అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి సుమారు ఈ నెల 15న తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది దక్షిణ ఒడిస్సా- ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశాలున్నాయని సంచాలకులు వివరించారు.
ఇదీ చదవండి: Fishes Died: భారీగా చేపల మృత్యువాత.. రూ.5 లక్షలు నష్టం