థామస్ రెడ్డిపై కార్మిక చట్టం ప్రకారం చర్యలు తప్పవని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ శివం రోడ్డులోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన టీఎంయూ రాష్ట్ర సమావేశంలో ఆయన పాల్గొన్నారు. యూనియన్ ఆవిర్భావం రోజు ఉన్నావా అంటూ థామస్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, డివిజన్లలో తనపై పూర్తి నమ్మకం ఉంచారని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఉద్యమ ద్రోహులు మంత్రుల పేరుతో కార్మికులను మోసం చేస్తున్నారని... దీనిని ఖండించాలో, సమర్థించాలో ఆలోచించుకోవాలని ఆయన తెలిపారు.
తన ఆస్తులపై విచారణకు సిద్దమని ప్రకటించారు. థామస్ రెడ్డి కార్మికుల నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. కార్మికశాఖ వద్దకు వెళ్లి కార్మికులతో ఓటింగ్ చేయించుకుందామని... ఎవరు గెలిస్తే వాళ్లు ప్రధాన కార్యదర్శిగా కొనసాగుదామన్నారు. ఫిబ్రవరి 7న కేంద్ర కమిటీ సమావేశం తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని అశ్వత్థామరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: రైతుల దీక్షకు మద్దతుగా ట్రాక్టర్లతో కాంగ్రెస్ ర్యాలీ