ETV Bharat / state

ఈ నెలాఖరు వరకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు - తిరుమల దర్శనాలు రద్దు

మే 31 వరకు తిరుమల తిరుపతి శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతి లేదని తితిదే ప్రకటించింది. కరోనా నేపథ్యంలో స్వామివారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే మే 3 వరకు దర్శనాలను పూర్తిగా రద్దు చేసింది తితిదే.

tirumal shut down till may 31st due to corona
ఈ నెలాఖరు వరకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు
author img

By

Published : Apr 16, 2020, 3:51 PM IST

కరోనా ప్రభావంతో ఏపీలోని తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలను మే 31 వరకు రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. లాక్​డౌన్ కారణంగా మే 3 వరకు దర్శనాలను పూర్తిగా రద్దు చేసిన తితిదే.. ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

ఆన్‌లైన్, పోస్టాఫీసు ద్వారా టిక్కెట్లు పొందిన భక్తులకు వాటిని రద్దు చేసుకునే అవకాశం కల్పించింది. భక్తులు.. వారి టిక్కెట్ల వివరాలతో పాటు బ్యాంకు ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్​ను helpdesk@tirumala.org కు పంపాలని కోరింది తితిదే. వివరాలను పరిశీలించి రీఫండ్ నగదు వారి ఖాతాల్లో జమ చేస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.