ETV Bharat / state

లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్​ - cm kcr review latest

రాష్ట్రంలో ఎంతమందికైనా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించటంతో పాటు వ్యాధి బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్​ ప్రగతిభవన్​లో వైరస్​ వ్యాప్తి నివారణ, లాక్​డౌన్ అమలు, పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

cm kcr review on corona virus in hyderabad
లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్​
author img

By

Published : Apr 16, 2020, 2:21 AM IST

కరోనాపై యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్న సీఎం.. 20 వేల పడకలతో లక్ష మంది రోగులకైనా చికిత్స అందించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్​-19 వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్​డౌన్ అమలు, పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై ప్రగతిభవన్​లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

514 మంది చికిత్స పొందుతున్నారు

కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల ఏర్పాట్లు, అందుతున్న చికిత్స, భవిష్యత్ అవసరాల కోసం తీసుకుంటున్న చర్యలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సీఎంకు వివరించారు. కొత్తగా మరో ఆరు కేసులు నిర్ధారణ కావటంతో ప్రస్తుతం 514 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో బుధవారం ఎనిమిది మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారన్న ఆయన... ఈరోజు మరో 128 మంది డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.

ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్ జోన్లు

లాక్​డౌన్​కు ప్రజలు చాలా బాగా సహకరిస్తున్నారని... రానున్న రోజుల్లోనూ ఇదేతరహాలో సహకరించాలని సీఎం కేసీఆర్​ కోరారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈనెల 20 వరకు యథావిథిగా లాక్​డౌన్ అమలవుతుందని.. ఆ తర్వాత పరిస్థితులను బట్టి మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందన్నారు. వైరస్ సోకిన వారి ఆధారంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి పకడ్బందీగా నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు.

రెండు లక్షల 25 వేల పీపీఈ కిట్లు

వైరస్ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్​ అన్నారు. ఎంతమందికైనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. వైద్యులు, సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులకు సంబంధించి కూడా ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు లక్షల 25 వేల పీపీఈ కిట్లు ఉండగా... కొద్ది రోజుల్లోనే ఈ సంఖ్య ఐదు లక్షలకు చేరుతుందని చెప్పారు. మరో ఐదు లక్షల పీపీఈ కిట్లకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు.

లక్షల మాస్కులకు ఆర్డర్

ప్రస్తుతం మూడు లక్షల 25 వేల ఎన్ 95 మాస్కులు సిద్ధంగా ఉండగా.. త్వరలోనే ఈ సంఖ్య కూడా ఐదు లక్షలకు చేరుకుంటుందని కేసీఆర్​ తెలిపారు. మరో ఐదు లక్షల మాస్కులకు ఆర్డర్ ఇచ్చామన్న సీఎం... మొత్తం పది లక్షల చొప్పున పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాలు, వైద్యులు, సిబ్బంది, ఆస్పత్రులు, పడకలు అన్నీ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

20 వేల పడకలు సిద్ధం

20 వేల పడకలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయన్న ముఖ్యమంత్రి.. లక్ష మంది రోగులకు చికిత్స చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. కరోనాపై యుద్ధానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని ప్రకటించారు. లాక్​డౌన్ అమలు, పేదలకు సాయం, పంటల కొనుగోలు అంశాల్లో ప్రజాప్రతినిధులు బాగా పనిచేస్తున్నారని ప్రశంసించిన కేసీఆర్​.. ప్రజలను ఇంకా చైతన్య పరచటంతోపాటు ప్రభుత్వ పరంగా జరుగుతున్న కార్యక్రమాలను చేరవేయాలని సూచించారు.

పంచాయతీలకు 308 కోట్లు, పట్టణాలకు 148 కోట్లు

వైద్య-ఆరోగ్య, పురపాలకశాఖల మంత్రులు మినహా మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు తమతమ జిల్లాలు, నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని కోరారు. పేదలకు బియ్యం పంపిణీ దాదాపుగా పూర్తైందని, నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. వైద్య, ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించినట్లు చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు నిరంతరంగా జరగాల్సి ఉన్నందున ఏప్రిల్ నెల కోసం పంచాయతీలకు 308 కోట్లు, పట్టణాలకు 148 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు సీఎం కేసీఆర్​ వెల్లడించారు.

ఇవీచూడండి: కంటైన్మెంట్​ జోన్​ ప్రజలకు అండగా ఉంటాం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.