ETV Bharat / state

Ticket War in Telangana BJP : బీజేపీలో అసమ్మతి సెగ.. పలుచోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతివ్వబోమంటూ కార్యకర్తల అల్టిమేటం

Ticket War in Telangana BJP : రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు షరా మామూలే. కానీ, పార్టీలో ఓ హోదా ఆశించి భంగపడి పార్టీలు ఫిరాయించడం, సొంత పార్టీ నేతలపై క్షేత్రస్థాయి నాయకులు ఆరోపణలు చేయడం మాత్రం ఈ రోజుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంతేగాక మేం మద్దతివ్వం అని ఖరాఖండిగా చెప్పిన దాఖలాలు చాలానే ఉన్నాయి. ఇదిలా ఇప్పటికే ప్రారంభమైన ఎన్నికల ప్రచారాల్లో తాయిలాల పర్వం జోరుగా సాగినట్లు కనిపిస్తుంది.

Election Heat in Telangana BJP 2023
Election Heat in BJP
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2023, 8:11 AM IST

Ticket War in Telangana BJP ఎన్నికల ప్రచారాల్లో జోరుగా సాగుతున్న తాయిలాల పర్వం.. క్షేత్రస్థాయి నాయకులు సైతం ఆరోపణలు

Ticket War in Telangana BJP : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగినప్పటి నుంచి అధికార, ప్రత్యర్థి పార్టీల మధ్య పోటీ మొదలైంది. అంతేగాక పార్టీలో టికెట్‌ ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీలు ఫిరాయించడం మామూలైంది. మేమేమైనా తక్కువా అన్నట్లుగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సైతం తమకు నచ్చని అభ్యర్థులపై బుసలు గక్కుతున్నారు. ఇప్పటికే కొందరు ప్రచారాలను ప్రారంభించారు. ఇటీవల మెదక్ జిల్లా నర్సాపూర్ బీజేపీ ఎమ్మెల్యే టికెట్ మురళి యాదవ్‌కు అధిష్ఠానం కేటాయించింది. దీంతో నియోజకవర్గ బీజేపీ నాయకులు(BJP Leaders) భగ్గుమంటున్నారు. స్వచ్ఛమైన నాయకులు, కార్యకర్తలు ఎవరూ మురళి యాదవ్​కు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా లేరని అన్నారు.

Election Heat in Telangana BJP 2023 : భూ కబ్జాలకు పాల్పడే వ్యక్తి మురళి యాదవ్‌ అంటూ ఆరోపణలు గుప్పించారు. మరోవైపు తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, మంచి విద్య, రవాణా, యువతకు ఆట స్థలం, స్పోర్ట్స్ క్లబ్, అన్ని వర్గాలకు మౌలిక వసతులు కల్పిస్తానని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ తెలిపారు. జగిత్యాలలో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్‌ బోగ శ్రావణికి టికెట్‌ ప్రకటించటంతో ఆమె జగిత్యాలలో ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించారు. తన గెలుపుతో ఈసారి జగిత్యాలలో తొలిసారిగా బీజేపీ జెండా ఎగర వేయటం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

BJP Manifesto Telangana 2023 : ప్రధాని మోదీ గ్యారెంటీగా.. ఏడు హామీలతో బీజేపీ 'ఇంద్రధనస్సు' మేనిఫెస్టో

Congress Leader on 6 Guarantees : పదేళ్ల కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ నాయకులు, సొంత కార్యకర్తలకే ఇచ్చుకున్నారని మాజీ మంత్రి, జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఏ.చంద్రశేఖర్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ(Telangana Congress 6 Guarantees)లకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని.. అధికారంలోకి వచ్చాక పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

BRS Election Campaign Telangana 2023 : ఇప్పటికే ఎన్నికల్లో తాయిలాల పర్వం మొదలైనట్లుగా కనిపిస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం(BRS Election Campaign)లో భాగంగా డబ్బులు పంపిణీ చేస్తుండగా.. భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.55 వేలను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు(Election Flying Squad Officers) పట్టుకున్నారు. మరోవైపు హైదరాబాద్‌ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎవరైనా శాంతి భద్రతల విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

BJP Manifesto Telangana 2023 : మరోవైపు గులాబీ తోటలో కమల వికాసమే లక్ష్యంగా కాషాయదళం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించిన బీజేపీ.. ఆదివారం తొలి జాబితా విడుదల చేసింది. అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించేలా కసరత్తు చేస్తున్న బీజేపీ.. మేనిఫెస్టోకు ఇంద్రధనుస్సు అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. బీఆర్​ఎస్​ మేనిఫెస్టో, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు ధీటుగా.. ఏడు ప్రధాన అంశాలపై హామీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ హామీలకు ప్రధాని మోదీనే గ్యారెంటీ అంటూ ఎన్నికల ప్రణాళిక ప్రకటించనుంది.

Telangana BJP MLA Candidates First List 2023 : హుజూరాబాద్​, గజ్వేల్​ నుంచి ఈటల.. గోషామహల్​ నుంచి రాజాసింగ్.. బీజేపీ తొలి జాబితా విడుదల​

BJP Lifted Suspension on MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.