సికింద్రాబాద్ పరిధిలో సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని రాంగోపాల్ పేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక హోండా ఆక్టివా, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. గతంలోనూ వీరిపై పలు కేసులు నమోదైనట్లు తెలిపారు. నిందితులు సికింద్రాబాద్‌కు చెందిన మహేశ్, కిరణ్, పవన్‌గా గుర్తించారు.
ఇదీ చూడండి:దివ్యాంగుడికి ఎన్‌ఆర్‌ఐల ఆర్థిక సాయం