సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫతేనగర్‌లో రెండు దేవాలయాల్లో చోరీ జరిగింది. స్థానిక గణేష్ ఆలయంలోకి చొరబడి హుండీ పగులగొట్టారు. అలాగే శివాలయంలో అమ్మవారి వెండి కిరీటం దొంగలించారు. గతంలో కూడా చోరీలు జరిగాయని, పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే మళ్లీ ఇలా జరిగిందని శివాలయం అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండిః చెన్నూరు ఎంఈవో ఇంట్లో చోరీ