ETV Bharat / state

Wings India: రెండో రోజు ఘనంగా ఏవియేషన్‌ షో.. రెండ్రోజులపాటు ప్రజలకు అనుమతి - కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి

హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో ఘనంగా జరుగుతోంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభమైన ఏవియేషన్ ప్రదర్శనకు వివిధ రాష్ట్రాల ఏవియేషన్ మంత్రులు, గవర్నర్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సదస్సు రెండో రోజులో భాగంగా బోయింగ్ వ్యాపార ప్రణాళికలు, సారంగ్ టీం ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Wings India
ఏవియేషన్ మంత్రులు, గవర్నర్‌లు
author img

By

Published : Mar 26, 2022, 4:46 AM IST

Updated : Mar 26, 2022, 6:03 AM IST

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా ఏవియేషన్- 2022 సదస్సులో రెండోరోజు పలు వ్యాపార ఒప్పందాలు జరిగాయి. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అధ్యక్షత జరిగిన సదస్సుకు.. ఏవియేషన్ షో లో భాగస్వాములైన 8 రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రస్తుతం విమాన ప్రయాణికుల సంఖ్య ఆశాజనకంగా ఉందన్న కేంద్రమంత్రి సింధియా.. ఈనెల 27 నుంచి ప్రారంభమయ్యే అంతర్జాతీయ ప్రయాణాలతో పునర్‌వైభవం సంతరించుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సదస్సులో పాల్గొన్నారు. సివిల్ ఏవియేషన్ రంగంలో మహిళా పైలెట్ల సంఖ్య విదేశాల కన్నా ఎక్కువ ఉండటం గర్వకారణమని గవర్నర్ తమిళిసై అన్నారు. ఏవియేషన్ ప్రదర్శనకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వటం గర్వకారణంగా ఉందన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి... హెలిప్యాడ్‌లను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని కేంద్రాన్ని కోరారు. ఎయిరో స్పేస్ మానుఫ్యాక్చరింగ్‌కు హైదరాబాద్ హబ్‌గా ఎదుగుతోందని.. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఎంఆర్వో సెంటర్‌కు అదనంగా మరిన్ని ఎంఆర్వో సెంటర్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

ఎయిర్​ షోను తిలకించిన గవర్నర్ దత్తాత్రేయ: సదస్సు తర్వాత పలు రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రి సింధియా, సారంగ్ టీం ఆధ్వర్యంలోని ఎయిర్ షోను ఆసక్తిగా తిలకించారు. హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సైతం ఎయిర్ బస్, ఎంబ్రరర్ విమానాలను ఎక్కి పరిశీలించారు. శుక్రవారంతో వ్యాపార ఒప్పందాలు ముగియగా.. ఇవాళ్టి నుంచి రెండ్రోజులపాటు ప్రజల సందర్శనకు అనుమతిస్తారు. ఉదయం, సాయంత్రం రెండు సమయాల్లో సారంగ్ టీం ఆధ్వర్యంలో ఎయిర్ షో ద్వారా అలరించనున్నారు.

ఇదీ చూడండి:

Wings India 2022: భాగ్యనగరం వేదికగా వింగ్స్ ఇండియా-2022 ఏవియేషన్ షో

Last Updated : Mar 26, 2022, 6:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.