ధరణి పోర్టల్‌కు సంబంధించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన ఉత్తర్వులు జారీ చేసింది. స్టాంప్ డ్యూటీ ఫీజు చెల్లించి... ఏవైన కారణాలతో రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే వారికి తిరిగి ఆ మొత్తాల్ని ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర మొత్తాన్ని ముందస్తుగా ఆన్లైన్లో చెల్లించిన తర్వాతనే తదుపరి ప్రక్రియ జరుగుతుంది.
అనుకోని ఇబ్బందులు తలెత్తి... అనుకున్న సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకోలేక పోతున్న వారు తిరిగి ఆ మొత్తాన్ని తీసుకోవడం ధరణి పోర్టల్ ద్వారా చెల్లిస్తున్న వారికి కష్టమై పోతుంది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ప్రజలు ఇబ్బంది పడకుండా సంబంధిత మొత్తాలను తిరిగి ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్లకు అధికారాలు కల్పిస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలల్లోపు... ఆ సంబంధిత మొత్తాన్ని తిరిగి పొందేందుకు వీలు కల్పించారు.
ఇదీ చదవండి: రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో తెరాస విజయం