దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యోదంతం కేసు విచారణ కమిషన్ నిమిత్తం 19 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కమిషన్ కార్యాలయంలో తాత్కాలికంగా నియమించిన ఉద్యోగులు ఆరు నెలల పాటు పనిచేయనున్నారు.
కమిషన్ కార్యదర్శిగా సిట్టింగ్ లేదా విశ్రాంత జడ్జి వ్యవహరించనున్నారు. 19 మంది తాత్కాలిక ఉద్యోగుల్లో నోడల్ అధికారి, ట్రాన్స్‌లేటర్, కంప్యూటర్ ఆపరేటర్లు, స్టెనోగ్రాఫర్ ఇతర సిబ్బంది ఉండనున్నారు. ఈ నెలాఖరుకు కమిషన్... హైదరాబాద్ చేరుకొని విచారణ చేపట్టే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: 'ఇబ్బందులు లేకుండా ఓటేసేలా ఏర్పాట్లు జరగాలి'