కామ్రేడ్ జార్జిరెడ్డి సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ నారాయణగూడలో క్రైస్తవ స్మశానవాటికలో జార్జిరెడ్డి సమాధి వద్ద ఆ చిత్ర యూనిట్ నివాళులర్పించారు. ఆయన చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను నిర్మించామన్నారు. సమాజం జార్జిరెడ్డి లాంటి వాళ్ళను చాలామందిని కోల్పోయిందని వారిని ఎలా కోల్పోయామో, ఎందుకు కోల్పోయామో తెలిపేందుకు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని అన్నారు.
జార్జిరెడ్డి క్యారెక్టర్‌ను ప్రజలకు చేరవేయడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నామని జార్జిరెడ్డి సినీ బృందం పేర్కొన్నారు. ఆయన 25 ఏళ్లకే ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మారాడని కొనియాడారు. ఆయన జీవిత చరిత్ర తెలుసుకున్నాక ఐదేళ్లుగా ఏ సినిమాను చేయలేదని చిత్ర దర్శకుడు జీవన్ రెడ్డి అన్నారు. ఆయన నిజాయితీని చెప్పేందుకు ఈ సినిమా తెరకెక్కించామని వెల్లడించారు.
నేను నాకంటే ఎక్కువ ప్రేమించే వ్యక్తి జార్జిరెడ్డి అని అన్నారు. రేపు జార్జిరెడ్డి మళ్లీ పుడుతున్నాడని, ఆయన చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని జీవన్‌రెడ్డి కోరారు.
ఇదీ చూడండి: హైకోర్టులో కేవియట్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్