హైదరాబాద్ మియాపూర్‌లోని నరేన్‌గార్డెన్స్‌లో చాగండ్ల నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో పద్మశాలి మేళను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు పలువురు సినీ, రాజకీయ, సామాజికవేత్తలు పాల్గొన్నారు. పద్మశాలిలు రాజకీయంగా, ఆర్థికంగా సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైన ఉందని పలువురు వక్తలు అభిప్రాపడ్డారు.
పద్మశాలిల ఆత్మగౌరవం, ఔన్నత్యాన్ని చాటుతూ గత 20 ఏళ్లుగా నరేంద్రనాథ్ పద్మశాలి మేళ నిర్వహించడం అభినందనీయమని పలువురు అన్నారు. పద్మశాలిలను ప్రోత్సహించేందుకు ఆయా రంగాల్లో రాణిస్తున్న వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి: కల్లు కోసం తల్లిని చంపిన కసాయి కూతురు