దూరవిద్య విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం ఓపెన్ స్కూల్ సొసైటీ షెడ్యూల్ విడుదల చేసింది. రేపటి నుంచి జనవరి 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వర శర్మ తెలిపారు.
జనవరి 5 వరకు నిర్ణీత రుసుముతో జనవరి 6 నుంచి 15 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. మీ సేవా, టీఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చునని వెంకటేశ్వర శర్మ తెలిపారు. పూర్తి వివరాలను www.telanganaopenschool.org ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'బెండకాయ తొక్కు పచ్చడి' చేసుకోండిలా..