గత నెల 22న ఈనాడు హైదరాబాద్లో "లోకం చూడకుండానే పై లోకాలకు" అనే శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు ధర్మాసనం సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణలోకి తీసుకుంది. ఈనాడు కథనానికి స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్ రావు ఇది ప్రయో ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించాల్సిన అంశమని పేర్కొంటూ లేఖ రాశారు. లింగ నిర్ధారణ పరీక్షలపై సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా అమలు కావడం లేదని ఆ లేఖలో న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇంకా లింగవివక్ష కొనసాగుతోందని, చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
న్యాయమూర్తి లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య, శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విధాన పరిషత్ కమిషనర్లు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కమిషనర్లు, వైద్యారోగ్య అధికారిని ప్రతివాదులుగా పేర్కొంది.
ఇదీ చూడండి : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రగతి రథం: కేసీఆర్