ETV Bharat / state

కరోనా చికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రులను ఎందుకు అనుమతించరు?

కరోనా చికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రులను ఎందుకు అనుమంచడం లేదని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షలకు, చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ గంటా జైకుమార్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

the-high-court-has-asked-the-ts-government-why-it-is-not-allowing-private-hospitals-for-corona-treatments
కరోనా చికిత్సలకు ప్రైవేటు ఆసుపత్రులను ఎందుకు అనుమతించరు?
author img

By

Published : May 13, 2020, 8:21 AM IST

కొవిడ్‌ పరీక్షలు, చికిత్సలను కేవలం ప్రభుత్వాసుపత్రులకే పరిమితం చేసి, ప్రైవేటు ఆసుపత్రులను ఎందుకు అనుమతించడంలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఆరోగ్యం ప్రాథమిక హక్కు అని, నచ్చిన, నమ్మకం ఉన్న వైద్యుడితో చికిత్స చేయించుకునే బాధితుల హక్కును మీరెలా కాదంటారని అడిగింది.

ఐసీఎంఆర్‌ అనుమతించినా, ప్రైవేటు ఆసుపత్రుల్లో పరీక్షలకు, చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన గంటా జైకుమార్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రమూర్తి, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ కొవిడ్‌ పరీక్షలు నిర్వహించడానికి 12 ప్రైవేట్‌ ల్యాబ్‌లకు ఐసీఎంఆర్‌ అనుమతించినా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంలేదన్నారు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యఖర్చులు భరించగలిగే వారిని అనుమతిస్తే ప్రభుత్వానికి భారం తగ్గుతుందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసౌకర్యాలపై పత్రికల్లో కథనాలు చూస్తున్నామని, ఉస్మానియా కారిడార్లలో కుక్కలు కూడా తిరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలు, నిపుణులైన డాక్టర్లపై ప్రభుత్వానికి నమ్మకం లేదా అంటూ ప్రశ్నించింది.

కరోనా వ్యాప్తి మొదలుపెట్టాక వెంటిలేటర్ల కొనుగోలు ప్రక్రియను చేపట్టిందని, ప్రభుత్వాసుపత్రుల్లో అధునాతన పరికరాల కొరత ఉందని వ్యాఖ్యానించింది. దీనిపై అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ స్పందిస్తూ ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతిస్తే పరిస్థితిని తీవ్రం చేస్తారని, దాన్ని అదుపు చేయడం సాధ్యం కాదన్నారు. ప్రైవేటు వారు దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు, వైద్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోందన్నారు. గచ్చిబౌలిలో స్టేడియాన్ని ఆసుపత్రిగా మార్చామని చెప్పగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అక్కడ డాక్టర్లు లేరని, పడకలూ తక్కువేనని వ్యాఖ్యానించింది. ఏజీ బదులిస్తూ, ప్రైవేటు వారు పంపిన రెండు వేల శాంపిళ్లను ఉచితంగా పరీక్షించామని చెప్పారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వమే అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఉత్తర్వులను తర్వాత వెలువరిస్తామంటూ వాయిదా వేసింది.

ఇదీ చూడండి: కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్​ దాడులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.