దిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్లో జరిగిన మతపరమైన ప్రార్థనల్లో రాష్ట్రానికి చెందిన వెయ్యి మందికి పైగా పాల్గొన్నట్లు సమాచారం. అధికారుల లెక్కల ప్రకారం 29 జిల్లాల నుంచి 1030 మంది మర్కజ్ కు వెళ్లినట్లు తేలింది. అత్యధికంగా రాజధాని పరిధి నుంచి 603 మంది వెళ్లొచ్చారు.
నిజామాబాద్ జిల్లా నుంచి 80 మంది, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 59మంది, వరంగల్ అర్బన్ నుంచి 38 మంది ప్రార్ధనలకు హాజరయ్యారు. అక్కడకు వెళ్లి వచ్చిన వారిలో కొందరికి పాజిటివ్ వచ్చినందున 1030 మందిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
వారందరినీ గుర్తించి వారితో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్న వారిని కూడా ఆసుపత్రులకు తరలించి పరీక్షిస్తున్నారు. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన ప్రతిఒక్కరూ విధిగా సమాచారం ఇవ్వాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసింది.
ఇవీ చూడండి: జలుబు, దగ్గే కాదు... ఇవి కూడా కరోనా లక్షణాలే!