రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా రాగల రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రేపు చాలా చోట్ల వర్షాలు కురువచ్చని వెల్లడించారు.
ఈ ఉదయం 8 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు...
- అత్యధికంగా సిద్దిపేట జిల్లా హబ్షీపూర్- 16.3 సెం.మీ.
- మల్కాజ్‌గిరి మెట్టుగూడ- 13.7 సెం.మీ.
- జగిత్యాల జిల్లా కొడిమ్యాల మం. పూడూరు- 12.8 సెం.మీ.
- సిద్దిపేట జిల్లా తొగుట మం. తుక్కాపూర్- 11.7 సెం.మీ.
- నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి- 11.4 సెం.మీ.
- ఆదిలాబాద్ జిల్లా బోథ్ మం. పొచ్చెర- 11 సెం.మీ.
- జగిత్యాల జిల్లా మేడిపల్లి- 11 సెం.మీ.
- సిద్దిపేట- 10.9 సెం.మీ.
- చేర్యాల- 10.6 సెం.మీ.
- ఖమ్మం జిల్లా మధిర మం. సిరిపురం- 10.5 సెం.మీ.
- జగిత్యాల జిల్లా మేడిపల్లి మం. గోవిందారం- 10 సెం.మీ.
ఇదీ చదవండి: భయం గుప్పిట్లో ముంపు బాధితులు.. పునరావాసం కోసం పడిగాపులు