ETV Bharat / state

Telangana News : టాప్​న్యూస్ @7PM - Top news 7pm

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Telangana top ten news
Telangana top ten news
author img

By

Published : Jul 26, 2022, 6:46 PM IST

Updated : Jul 26, 2022, 7:00 PM IST

  • ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి..

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైటెక్​సిటీ రైల్వేస్టేషన్ సమీపంలో ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతులు వనపర్తికి చెందిన రాజప్ప, శ్రీను, కృష్ణగా గుర్తించారు. మృతుల్లో ఒకరివద్ద మద్యం సీసాలు ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదం ఉదయం 8 గంటల సమయంలో జరిగినట్లు భావిస్తున్న పోలీసులు.. మూలమలుపులో పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

  • తడిసిముద్దవుతోన్న హైదరాబాద్​..

జోరువానలకు భాగ్యనగరం తడిసిముద్దవుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మోకాల్లోతు ప్రవాహంతో... ప్రభావిత కాలనీలవాసులు ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. చెరువులకు వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.

  • వణికిస్తోన్న వానలు.. స్తంభించిన జనజీవనం..

Heavy Rains in Telangana: రాష్ట్రంలో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలతో మరికొన్ని చోట్ల వరదల ఏకధాటిగా కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలకే చిన్న తరహా ప్రాజెక్టులు, చెరువులు అలుగులు పారుతుండగా.... వరదలు పోటెత్తుతున్నాయి.

  • వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదు

Balka on Etela: భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్​ బాల్క సుమన్​ విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లోని తెరాస కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

  • ఒకేసారి స్టేషన్​లోని 66 మంది పోలీసులు బదిలీ..

కేరళ కోజికోడ్​లో పోలీస్​ కస్టడీ మృతి కేసులోని అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న స్టేషన్ హౌస్​​​ ఆఫీసర్ సహా 66 మంది పోలీసులను బదిలీ చేసింది. గత వారం పోలీస్​ కస్టడీ నుంచి విడుదలైన 42 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పినరయి విజయన్​ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అంతకుముందే రూరల్​ ఎస్పీ ఇచ్చిన నివేదిక మేరకు.. ఒక ఎస్సై సహా ముగ్గురు పోలీసులను సస్పెండ్​ చేశారు కన్నూర్​ డీఐజీ.

  • శబరిమల ఆలయంలో అనూహ్య సమస్య-

Ayyappa temple water leakage: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో అనూహ్య సమస్య తలెత్తింది. గర్భగుడిలోని బంగారు తాపడం చేసిన పైకప్పు నుంచి నీరు లీకవుతోంది. ఈ లీకేజీని గుర్తించిన ట్రావన్​కోర్​ దేవస్థాన అధికారులు మరమ్మత్తు పనులను ప్రారంభించారు. దేవస్థాన బోర్డు సభ్యుడు మాట్లాడుతూ.. ఇది చిన్న సమస్యేనని.. గర్భగుడిలో ఎడమవైపు ద్వారపాలకుల విగ్రహాల వద్ద లీకేజీని గుర్తించామని తెలిపారు.

  • బాసర విద్యార్థి మృతి.. కలుషిత ఆహారం వల్లే..!

బాసర ఐఐఐటీలో ఆహారం కలుషితమై అనారోగ్యం పాలైన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వరంగల్ జిల్లాకు చెందిన సంజయ్ కిరణ్ (22).. ఇటీవల విషతుల్యమైన ఆహారం తిని ఆస్పత్రి పాలయ్యాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

  • టీ20 సిరీస్​.. కెప్టెన్​ రోహిత్​ రెడీ.. కానీ

Teamindia vs West indies T20 series: ఈ నెల 29 నుంచి విండీస్​తో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం కెప్టెన్​ రోహిత్​ శర్మ సిద్ధమయ్యాడు. రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌లతో కలిసి అతడు ట్రినిడాడ్‌ చేరుకొన్నాడు. అయితే ఈ సిరీస్​కు స్టార్​ ఓపెనర్​ కేఎల్​ రాహుల్ మిస్​ అయ్యాడు.

  • నాగార్జునే స్ఫూర్తి.. సైకిల్​ చైన్​తో భయపెట్టేవాడిని

'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్‌' లాంటి చిత్రాల పోస్టర్లను తమ అన్నపూర్ణ స్టూడియోస్‌లో గర్వంగా పెట్టుకున్నామని, ఆ జాబితాలో కిచ్చా సుదీప్​ నటించిన 'విక్రాంత్‌ రోణ' త్వరలో చేరుతుందన్నారు ప్రముఖ నటుడు నాగార్జున. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై, ఆయన మాట్లాడారు. ఇక సుదీప్​ మాట్లాడుతూ.. నాగ్​పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

  • ఆ 8 అంశాలపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం

తెలుగు సినీ నిర్మాతల కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి థియేటర్‌లో విడుదలైన భారీ చిత్రాలు పదివారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరగ్గా, తుది నిర్ణయాన్ని కమిటీకి వదిలేశారు. అయితే, అనూహ్యంగా నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కార్యవర్గ సమావేశంలో చర్చించిన 8 కీలక అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు

Last Updated : Jul 26, 2022, 7:00 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.