ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @7AM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today
author img

By

Published : Dec 25, 2022, 7:00 AM IST

  • సంక్రాంతికి కష్టమే: ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా లేని రైళ్లు

సంక్రాంతి పండుగ రద్దీ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. కానీ రైల్వే శాఖ ప్రకటించిన తేదీలు, రూట్లను పరిశీలిస్తే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా లేవు.

  • భద్రాచలం కరకట్ట ఖరారు..! ఇకనైనా వరద కష్టాలు తీరేనా..!!

గోదావరి వరద ముంపు నుంచి భద్రాచలం రక్షణకు శ్రీరామ రక్షలా భావిస్తున్న కరకట్టల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. భద్రాచలం, బూర్గంపాడు రెండు వైపులా కలిపి 58 లేదా 65 కిలోమీటర్ల పొడవునా 2 రకాలుగా ఈ కరకట్టలు నిర్మించేందుకు నీటి పారుదల శాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది.

  • క్రిస్మస్​ వేడుకలకు సిద్ధమైన మెదక్​ చర్చి..

అన్నార్తుల ఆకలి తీర్చడం కోసం వెలసిన దేవాలయం. పరమత సహనాన్ని చాటుతూ శాంతికి.. ప్రేమకు ప్రతీకగా నిలుస్తున్న ఆధ్యాత్మిక క్షేత్రం. దశాబ్దాలు గడిచినా చెక్కుచెదరని చారిత్రక కట్టడం. ఆసియాలోనే రెండో అతిపెద్ద మెదక్‌ చర్చి.. అలనాడు వెలిసిన అద్భుత సౌధం. అందులో అడుగిడితే చాలు.. ఆధ్యాత్మిక పరిమళాలతో పునీతమవుతాం.

  • 'రైతులు దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ కోరుకుంటున్నారు'

బీజేపీ హయాంలోనే వ్యవసాయానికి అధిక నిధులు ఇచ్చామన్న కేంద్రమంత్రి కిషన్​రెడ్డి వ్యాఖ్యలకు, ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టించారన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.మోదీ, రైతులకు క్షమాపణ చెప్పిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు.

  • రహదారి పక్కనే శిశువుకు జన్మనిచ్చిన మహిళ..

పాపం నిండు గర్భిణి.. త్వరలోనే డెలివరి.. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంది ఆమె. రోడ్డు పక్కనుంచి నడుచుకుంటూ వెళుతుంది.. ఇంతలోనే ఉన్నట్టుండి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆనొప్పులు భరించలేక ఆమె జాతీయ రహదారి పక్కనే కూర్చుండి పోయింది.. స్థానికులు గమనించి ఇంకా ఈ భూమి మీద మానవత్వం ఉందని నిరూపించారు.

  • తిమింగలం వాంతితో దందా.. 25కేజీలు సీజ్ చేసిన పోలీసులు..

తమిళనాడు తూత్తుకుడిలో రూ.25 కోట్లు విలువ చేసే అంబర్​గ్రీస్​ను(తిమింగలం వాంతి) అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి రూ.25 కోట్ల విలువ చేసే అంబర్​గ్రీస్​ను స్వాధీనం చేసుకున్నారు.

  • 2022 నేర్పిన ఆర్థిక పాఠాలేంటి?..

2022 ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? నూతన సంవత్సరంలో వీటిని ఎలా సరిచేసుకోవాలి? ద్రవ్యోల్బణం, ఉద్యోగ తొలగింపులు, క్రిప్టోకరెన్సీ పతనం, మాంద్యం భయాలు.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేశాయి.

  • పుతిన్ సేనల అరాచకాలు.. అనాథ పిల్లల కిడ్నాప్..

వైమానిక దాడులతో ఉక్రెయిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రష్యా... యుద్ధ నిబంధనలను ఉల్లంఘించమే కాకుండా అనేక దారుణాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోర్టు సిటీ ఖేర్సన్‌లోని అనాథ పిల్లలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. వారికి శిక్షణ ఇచ్చి సైన్యంలో చేర్చుకోనున్నట్లు సమాచారం.

  • టెస్టుల్లో విరాట్​ కోహ్లీ తడబాటు..

టీ20 ప్రపంచకప్‌ తర్వాత విశ్రాంతి తీసుకొని మరీ బంగ్లాదేశ్‌ పర్యటనకు వచ్చిన విరాట్ కోహ్లీ.. మరోసారి బ్యాటింగ్‌లో తడబాటుకు గురి కావడం కనిపిస్తోంది. బంగ్లాతో రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. దీంతో అతడి సగటు 50 కంటే తక్కువకు పడిపోయింది.

  • ఓటీటీలోకి అవతార్​ 2 అప్పుడే..

సరికొత్త ప్రపంచంతో ప్రేక్షకులను అలరించింది అవతార్​ 2. తాజాగా ఈ సినిమా ఓటీటీపై చర్చ జరుగుతోంది. కాగా, ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫాంలో అవతార్​ 2 విడుదల కాబోతుందని సమాచారం. విడుదల తేదీ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.