ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్​ @7AM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today
author img

By

Published : Nov 19, 2022, 6:59 AM IST

  • రామోజీ ఫిల్మ్​ సిటీకి ఉత్తమ ఆతిథ్య పురస్కారం..

దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ పర్యాటక, ఆతిథ్య సేవలగానూ రామోజీ ఫిల్మ్ సిటీకి పురస్కారం దక్కింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై నుంచి పురస్కారాన్ని అందుకున్నారు రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ సీహెచ్ విజయేశ్వరి.

  • ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా నేత బి.ఎల్‌.సంతోశ్​కు నోటీసులు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు సిట్ అధికారులు సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు జారీ చేశారు.

  • 'మా ఇంటిపై 50 మంది టీఆర్​ఎస్ కార్యకర్తలు దాడి చేశారు'

ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఇంటిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడిపై ఆయన తల్లి ధర్మపురి విజయలక్ష్మి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె తరపున పర్సనల్‌ అడ్వకేట్లు, మేనేజర్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు.

  • ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటన.. నివేదిక ఇవ్వాలని గవర్నర్​ ఆదేశం

ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై నివేదిక ఇవ్వాలని డీజీపీని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆదేశించారు. ఈ ఘటనపై తమిళిసై విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని వ్యాఖ్యానించారు.

  • 'రాష్ట్ర అవసరాలు తీరాకే నీటి మళ్లింపు జరగాలి'

జాతీయ నీటి అభివృద్ధి సంస్థకు తెలంగాణ ఈఎన్‌సీ లేఖ రాసింది. గోదావరి-కావేరి అనుసంధానం ప్రతిపాదనపై తమ అభిప్రాయం చెప్పింది. ముందుగా మహానది-గోదావరి అనుసంధానం పూర్తి చేయాలని తెలిపింది. ఆ తర్వాతే గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని అందులో పేర్కొంది.

  • 'ఆ స్టేడియానికి వస్తే బాంబు పేలుస్తాం'.. భారత్ జోడో యాత్రకు బెదిరింపు లేఖ

భారత్ జోడో యాత్రకు బాంబు బెదిరింపు లేఖ వచ్చింది. ఇండోర్‌లోని స్థానిక స్టేడియంలో జోడో యాత్రికులు బస చేస్తే నగరంలో బాంబు పేలుళ్లు చేపడతామని గుర్తు తెలియని వ్యక్తులు ఆ లేఖలో హెచ్చరించారు.

  • జైల్లో 140 మంది ఖైదీలకు ఎయిడ్స్‌.. ఏం జరిగింది?

ఉత్తర్​ప్రదేశ్‌లోని గాజియాబాద్‌ జిల్లా జైల్లో 140 మందికి హెచ్‌ఐవీ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని జైలు సీనియర్‌ అధికారులు ధ్రువీకరించారు. వారికి ప్రత్యేక కేంద్రంలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

  • యూకేలో మన అమ్మాయికి అరుదైన పురస్కారం..

భారత్​కు చెందిన 13 ఏళ్ల బాలిక తన రచనా కౌశలంతో ఆకట్టుకుంది. ప్రపంచ ప్రఖ్యాత 'క్వీన్స్‌ కామన్వెల్త్‌ ఎస్సే కాంపిటిషన్‌'లో జూనియర్ విభాగంలో రన్నరప్​గా నిలిచింది. బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌లో గురువారం వైభవంగా జరిగిన కార్యక్రమంలో బ్రిటన్‌ రాణి కెమిల్లా నుంచి మౌలిక పురస్కారాన్ని అందుకొంది.

  • ప్రపంచకప్​ ఎఫెక్ట్.. బీసీసీఐ కీలక నిర్ణయం.. జాతీయ సెలక్షన్ కమిటీపై వేటు

భారత క్రికెట్​ నియంత్రణ మండలి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమ్ఇండియా మాజీ పేసర్​ చేతన్​ శర్మ నేతృత్వంలోని జాతీయ సీనియర్​ సెలెక్షన్​​ కమిటీని తొలిగించింది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్​కప్​లో టీమ్​ఇండియా సెమీస్​లో ఇంటిముఖం పట్టింది.

  • ఆ విషయంలో ఫుల్​ హ్యాపీగా సమంత.. కారణమిదే

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'యశోద'. సరోగసి నేపథ్యంలో థ్రిల్లర్‌ కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్​ను సొంతం చేసుకుంది. దీంతో విజయాన్ని అందించిన ఫ్యాన్స్‌కు సమంత కృతజ్ఞతలు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.