ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @9PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana Top News today
Telangana Top News today
author img

By

Published : Oct 29, 2022, 8:59 PM IST

  • ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులకు వైద్య పరీక్షలు పూర్తి..

ఎమ్మెల్యేలకు ఎర కేసులోని ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మొయినాబాద్​ పీఎస్​కు తరలించారు. వారి నుంచి మరోసారి వాంగ్మూలం సేకరించి.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.

  • 'సమయమొచ్చినప్పుడు సీఎం అన్ని వివరాలు వెల్లడిస్తారు'

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసుపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాము ఏం మాట్లాడినా వక్రీకరిస్తారని చెప్పారు. చట్టం కచ్చితంగా తన పని తాను చేస్తుందని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సందర్భానుసారంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, దర్యాప్తు సంస్థలు వివరాలు వెల్లడిస్తాయని కేటీఆర్ తెలిపారు.

  • 'తండ్రీకుమారులిద్దరినీ గద్దె దించి సంప్రోక్షణ చేస్తాం'

ఎమ్మెల్యేలు తప్పు చేయకపోతే ప్రగతిభవన్‌లో ఎందుకు పెట్టారని బండి సంజయ్ ప్రశ్నించారు. 16 మంది ఎమ్మెల్యేలు డ్రగ్స్‌ తీసుకుంటారని విమర్శించారు. భాజపా అధికారంలోకి రాగానే ఆ ఎమ్మెల్యేలతో సహా కేసీఆర్ కుటుంబసభ్యులకూ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు.

  • 'ఆ నలుగురు ఎమ్మెల్యేల ఫోన్​లు ఎందుకు సీజ్​ చేయలేదు'

మునుగోడు ఉపఎన్నిక ముందు తెరాస, భాజపా కలిసి వ్యూహాత్మకంగానే వివాదం సృష్టిస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఎమ్మెల్యేల ఎర కేసులో రోహిత్‌రెడ్డిని నిందితుడిగా చేర్చకుండా పీసీ యాక్టు ఎలా నిలబడుతుందని ప్రశ్నించారు.

  • గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి డిజిటల్ కాపీలను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. మొత్తం 2,85,916 మంది అభ్యర్థుల డిజిటల్ ఓఎంఆర్ పత్రాలను అందుబాటులో ఉంచారు.

  • ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ మన రక్షణశాఖే..

ప్రపంచంలోనే అత్యధిక మందికి ఉద్యోగాలు కల్పించిన వ్యవస్థగా భారత రక్షణశాఖ నిలిచింది. సైనికులు, సైనికేతరులు కలిపి 29లక్షల 20 వేల మంది సిబ్బందితో భారత రక్షణ శాఖ ప్రపంచంలోనే అత్యధిక మంది ఉద్యోగులను కలిగి ఉందని జర్మనీకి చెందిన స్టాటిస్టా వెల్లడించింది. రెండో స్థానంలో అమెరికా రక్షణశాఖ నిలిచినట్లు ప్రకటించింది.

  • గుజరాత్​ సర్కార్​ కీలక నిర్ణయం

గుజరాత్‌లో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చేలా భాజపా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఓ ఉన్నత స్థాయి కమిటినీ ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

  • క్రిమియా తీరంలో అలజడి..

ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతల వేళ క్రిమియా తీరంలో మాస్కో నౌకాదళంపై డ్రోన్‌ దాడులు జరగడం కలకలం రేపుతోంది. ఈ దాడులను తిప్పికొట్టినట్లు రష్యా అధికారులు చెబుతుండగా.. యుద్ధ నౌకలు దగ్ధమైన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

  • 'ఆ లోపాలను టీమ్ఇండియా దిద్దుకోవాలి'

భారత జట్టు మాజీ సారథి కపిల్​ దేవ్ వరల్డ్​ కప్​లో​ టీమ్ ఇండియా ఆటతీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో దిద్దుకోవాల్సిన లోపాలున్నాయని అన్నాడు. ఆ జట్లతో ఆడేటప్పుడు సరైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పాడు.

  • ఇండస్ట్రీలో విషాదం..

చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఓ యంగ్​ మ్యూజిక్​ డైరెక్టర్​ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.