ETV Bharat / state

రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటు - గెజిట్ నోటిఫికేషన్ జారీ - ఈసీ ఇష్యూస్ గెజిట్ నోటిఫికేషన్

Telangana Third Legislative Assembly Gazette Notification Released : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గెజిట్‌ను సీఈవో వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి గవర్నర్ తమిళిసైకి అందజేశారు. అంతేకాకుండా ఎన్నికలపై నివేదిక కూడా అందించారు. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను వికాస్ రాజ్, గవర్నర్‌కు సమర్పించారు. మరోవైపు ప్రస్తుత శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ సర్క్యులర్ జారీ చేశారు.

Telangana Third Legislative Assembly Gazette Notification Released
Telangana Third Legislative Assembly Gazette Notification
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 4, 2023, 7:54 PM IST

Telangana Third Legislative Assembly Gazette Notification Released : రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు(TS Assembly Election Results) ముగియడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రంలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. గవర్నర్‌ తమిళిసైకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్‌ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ప్రధాన కార్యదర్శి అవినాశ్​ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ గెజిట్‌ను అందజేసింది. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితా(Winning MLA Candidates List)ను కూడా గవర్నర్‌కు వికాస్‌రాజ్‌ అందజేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటైంది. మంత్రివర్గ సిఫార్సు మేరకు రెండో శాసనసభను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ రద్దు చేశారు.

EC Issues Gazette Notification for Third Telangana Assembly : ఇక రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకార ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈసీ బృందం గవర్నర్‌ను కలవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం కూడా గవర్నర్‌ తమిళిసైను కలవనుంది. అయితే కాంగ్రెస్ శాసన సభాపక్షనేతగా ఎన్నికైన వారి పేరును గవర్నర్‌కు నివేదించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు. తర్వాత సీఎల్పీ నేతకు డిజిగ్నేటెడ్ సీఎం హోదా ఇచ్చి ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారు.

కాంగ్రెస్‌కు కొత్త తిప్పలు - శాసనమండలిలో ఒకే ఒక్క సభ్యుడు

మంత్రులకు వాహనాలు సిద్ధం : మరోవైపు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం రాజ్​భవన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళే ప్రమాణ స్వీకారం ఉండవచ్చన్న సమాచారం నేపథ్యంలో ముందస్తుగానే ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం కోసం అవసరమైన టెంట్లు, కుర్చీలు, సహా ఇతరత్రా సామగ్రిని ఇప్పటికే తరలించారు. సాధారణ పరిపాలనా శాఖ, ఆర్‌ అండ్‌ బీ, జీహెచ్ఎంసీ(GHMC) సహా ఇతర శాఖల అధికారులు అవసరమైన కసరత్తు చేశారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు రాజభవన్‌కు వెళ్లి, ప్రస్తుతం అసెంబ్లీ రద్దు తీర్మాన పత్రాన్ని గవర్నర్‌ తమిళిసైకు అందించారు. అలాగే కొత్త మంత్రుల కోసం వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. దిల్‌కుశ్​ అతిథి గృహానికి వాహనాలను అధికారులు తీసుకొచ్చారు.

కాంగ్రెస్​లో వీడని ఉత్కంఠ : కాంగ్రెస్ పార్టీలో సీఎల్పీ నేత ఎవరన్నదానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే(AICC Chief kharge)కు ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు అప్పగించారు. దీనికి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రవేశపెట్టిన ఏకవాక్య తీర్మానాన్ని భట్టి విక్రమార్క, సీతక్కతో పాటు పలువురు ఎమ్మెల్యేలు బలపరిచినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పంపిన తీర్మానాన్ని అధ్యయనం చేసి హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అధిష్ఠానం నిర్ణయం కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు(Congress MLAs) వేచిచూస్తున్నారు. అటు సీఎల్పీ నేత ఎంపికపై అధిష్ఠానంతో చర్చించేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ దిల్లీకి బయలుదేరి వెళ్లారు. అధిష్ఠానం నుంచి ప్రకటన వచ్చాకే గవర్నర్‌ను కాంగ్రెస్‌ నేతలు(Congress Leaders) కలవనున్నట్టు తెలుస్తోంది. అప్పుడే సీఎం ప్రమాణ స్వీకారంపై స్పష్టత రానునట్లు సమాచారం.

రాజ్​భవన్​లో నూతన సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు - మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్

గెలిచిన అభ్యర్థుల సంబురాలు - పార్టీ శ్రేణులతో కలిసి విజయోత్సవ ర్యాలీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.