ETV Bharat / state

Telangana Student Committed Suicide in IIT Kharagpur : ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

Telangana Student Committed Suicide in IIT Kharagpur : మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన కిరణ్ చంద్ర అనే విద్యార్థి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మృతి చెందాడు. మంగళవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

committed suicide
committed suicide
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2023, 4:48 PM IST

Updated : Oct 18, 2023, 10:18 PM IST

Telangana Student Committed Suicide in IIT Kharagpur : ఐఐటీ ఖరగ్‌పూర్‌లో (IIT Kharagpur) ప్రాజెక్టు ఒత్తిడి భరించలేక.. తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మెదక్ జిల్లా తూప్రాన్ చెందిన కిరణ్‌చంద్రగా (Kiran Chandra) పోలీసులు గుర్తించారు. కిరణ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడని తెలిపారు. కిరణ్ సోదరుడు కూడా అక్కడే చదువుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

IIT Kharagpur
Telangana Student Committed Suicide in IIT Kharagpur మృతుడు కిరణ్‌చంద్ర

ఉరివేసుకుని భార్య.. రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై బలవన్మరణం

Kiran Chandra Committed suicide at IIT Kharagpur : ఈ ఘటన జరిగిన సమయంలో అతను కూడా హాస్టల్‌లోనే ఉన్నాడని పోలీసులు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో, ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ముగ్గురు విద్యార్థులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అసోం నివాసి ఫైజాన్ అహ్మద్ గతేడాది మృతిచెందాడు.

Couple Suicide in Peddapalli : ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య.. అనాథలైన ఆ పసిబిడ్డలకు దిక్కెవరు?

అసోం నివాసి ఫైజాన్ అహ్మద్ మృతిపై పోలీసులు వాస్తవాలనే కప్పిపుచ్చారనే ఆరోపణలు వచ్చాయి. తర్వాత దీనిపై విచారణ జరిపిన.. కోల్​కత్తా హైకోర్టు.. ప్రత్యేక వైద్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రెండోసారి ఫైజాన్ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. వైద్యులు ఈ నివేదికను.. న్యాయస్థానానికి సమర్పించారు. ఈ నివేదికపై స్పందించిన కోల్​కతా హైకోర్టు.. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ ఎస్‌.జయరామ్‌ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. గత జూన్‌లో కూడా ఐఐటీ హాస్టల్‌లో ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు.

కిరణ్‌చంద్ర మరణవార్త తెలుసుకొని కుటుంబసభ్యలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తూప్రాన్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కేతావత్ చందర్ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో కేతావత్ పవన్, కేతావత్ కిరణ్‌లు.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నారు. మరో కుమారుడు కొంపల్లిలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం రాత్రి కిరణ్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కిరణ్‌కు కిడ్నిలో రాళ్ల సమస్య ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడ్డాడని.. గత నెలలోనే హైదరాబాద్‌లో వైద్యం చేయించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 4న కళాశాలకు వెళ్లాడని.. ఇంతలోనే కళాశాలలో ఒత్తిడి భరించలేక ఆత్మహత్య (Suicide) చేసుకున్నట్లు పేర్కొన్నారు. పవన్, కిరణ్‌లు ఇద్దరు చిన్న నాటి నుంచి చదువులో రాణించేవారని అన్నారు. ఇప్పడు ఈ విషయం తెలిసి ఆవేదనకు గురయ్యామని చెప్పారు. అనంతరం కిరణ్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు.. వారు ఖరగ్‌పూర్ బయల్దేరి వెళ్లారు.

విద్యార్థులపై ఒత్తిడి పెరగడం వల్లే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. అసైన్​మెంట్లు, టార్గెట్లు, పరీక్షల ఒత్తిడి వారిపై విపరీతంగా ఉంటోందని చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా విద్యార్థులను గైడ్ చేసే వ్యవస్థ లేకపోవడమే వారి మానసిక సంఘర్షణకు కారణమని... ప్రభుత్వాలు ఈ అంశంపై కూడా దృష్టి సారించాలని వారు సూచిస్తున్నారు.

Young man suicides in Patancheru : బతకాలనిలేదని.. సెల్ఫీవీడియో సోదరికి పంపి.. యువకుడి ఆత్మహత్య

Last Updated : Oct 18, 2023, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.