హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి మద్దుతు ఇవ్వడం లేదని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం స్పష్టం చేసింది. రాష్ట్ర ఏర్పాటు కోసం బలిదానం చేసిన విశ్వబ్రాహ్మణులకు సరైనా గుర్తింపు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయంపై మాత్రమే కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులకు అవకాశం కల్పించిన పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఒక రాజకీయ పార్టీకే మద్దతు ఇస్తున్నట్లు దినపత్రికల్లో వచ్చిన వార్తలను సంఘం నాయకులు ఖండించారు.
మాజీ శాసనసభ సభాపతి మధుసూదనాచారికి ఎమ్మెల్సీ గాని, రాజ్యసభ సీటు గాని ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌కు గతంలో ప్రకటించిన రూ.250 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. ఐదేళ్ల క్రితం ప్రకటించిన ఆత్మగౌరవ భవన నిర్మాణం ఇంత వరకు చేపట్టలేదని మండిపడ్డారు.
ఇవీ చదవండి: సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: భోలక్‌పూర్ తెరాస అభ్యర్థి