ETV Bharat / state

Telangana Rythu Runa Mafi 2023 : రూ. లక్ష, ఆపై రుణాల మాఫీకి సంబంధించిన చెల్లింపులు ప్రారంభం - రైతు రుణమాఫీ 2023

Telangana Rythu Runa Mafi 2023 : రూ.లక్ష రుణమాఫీ సంపూర్ణం చేసే దిశగా ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది. లక్ష లోపు రుణాల చెల్లింపులను గతంలోనే పూర్తి చేసిన సర్కార్.. ఆపై రుణాల మాఫీకి సంబంధించిన చెల్లింపులను కూడా ప్రారంభించింది. ఈ తరహాలో ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్ల వరకు చెల్లింపులు జరిగినట్లు సమాచారం. సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా చెల్లింపులు చేస్తున్నారు.

Telangana Rythu Runa Mafi 2023
Rythu Runa Mafi
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2023, 9:50 AM IST

Telangana Rythu Runa Mafi 2023 లక్ష ఆపై రుణాల మాఫీకి సంబంధించిన చెల్లింపులు ప్రారంభం

Telangana Rythu Runa Mafi 2023 updates : రాష్ట్ర ప్రభుత్వం 2014లో తొలి విడతగా రుణమాఫీని అమలు చేసింది. రెండో విడతగా రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ(Rythu Runa Mafi Telangana) చేస్తామని 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్​ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ ఏడాది డిసెంబరు 11 నాటికి ఉన్న రూ.లక్ష పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. అందుకు ఆర్థికశాఖ, వ్యవసాయ అధికారులు బ్యాంకుల ద్వారా వివరాలు సేకరించినా.. ఆ తర్వాత పెద్దనోట్ల రద్దు, కరోనా, ఇతర ఇబ్బందులతో ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకులోనై నిధుల కొరత ఏర్పడింది.

Crop Loan Waiver Telangana Farmers 2023 : అయితే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా రైతు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. 2018 డిసెంబర్ 11 నాటికి రైతులు తీసుకున్న అప్పునకుగాను.. రూ.లక్ష రుణమాఫీ(Runa Mafi Money) చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అందుకు అనుగుణంగా దశల వారీగా చెల్లింపులు చేస్తోంది. మిగిలిన మొత్తానికి సంబంధించిన చెల్లింపులు కూడా పూర్తి చేసి రుణమాఫీని సంపూర్ణం చేయాలని.. ఈ నెల మొదట్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం కేసీఆర్(CM KCR on Farmer Loan Waiver) ఆదేశించారు.

Rythu Runamafi Telangana 2023 : వచ్చే నెల రెండో వారంలోపు రుణమాఫీ చెల్లింపులు పూర్తి..!

విడతల వారీగా చెల్లింపులు చేస్తూ సెప్టెంబర్ రెండో వారంలోపు రైతు రుణమాఫీని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఆర్థికశాఖ చెల్లింపులు చేస్తూ వచ్చింది. ఇప్పటి వరకు రూ.లక్షలోపు రుణాలు ఉన్న వారందరికీ సంబంధించిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. రూ.99 వేల 999 వరకు అప్పులు ఉన్న వారందరికీ ఈ నెల 14న ప్రభుత్వం ఏక మొత్తంలో చెల్లింపులు చేసింది. 14న ఒక్క రోజే రుణమాఫీకి సర్కారు ఏకంగా రూ.5 వేల 809 కోట్ల చెల్లింపులు చేసింది. దాంతో 16 లక్షల 66 వేల 899 మంది రైతులకు సంబంధించి రూ.7 వేల 753 కోట్ల పైగా రుణమాఫీ చెల్లింపులు పూర్తయ్యాయి.

Rythu Runamafi 2023 : రూ. లక్షలోపు రుణమాఫీ పూర్తి చేసిన ప్రభుత్వం

రూ.లక్ష, ఆపైన రుణాలు తీసుకున్న రైతులు 11 లక్షల మంది ఉన్నారు. వారందరికీ రూ.లక్ష వరకు మాఫీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.11 వేల కోట్లు అవసరం. రూ.లక్ష మొదలు.. తక్కువ రుణం ఉన్న వారి నుంచి మాఫీ పూర్తి చేయాలని నిర్ణయించారు. రూ.లక్ష, ఆపై ఉన్న వారికి కూడా రుణమాఫీ చెల్లింపుల ప్రక్రియను ఆర్థికశాఖ రెండు రోజులు క్రితం ప్రారంభించింది. ఇప్పటి వరకు రూ.వెయ్యి కోట్లకు చెల్లింపులు చేసినట్లు సమాచారం. ఇంకా రూ.10 వేల కోట్లకు పైగా చెల్లింపులు చేసి రుణమాఫీని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఖజానాకు వస్తున్న ఆదాయాన్ని బట్టి క్రమంగా చెల్లింపులు చేసేలా ఆర్థికశాఖ చర్యలు తీసుకుంటోంది.

Rythu Runamafi Telangana 2023 : అన్నదాతలకు పంద్రాగస్టు కానుక.. రూ.99,999 లోపు రైతు రుణాలన్నీ మాఫీ

Telangana Rythu Runa Mafi 2023 : సాంకేతిక చిక్కులతో రైతులకు చేరని రుణమాఫీ సొమ్ము.. మూతబడిన ఖాతాల్లో జమై నిధులు వెనక్కి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.