యాసంగి(రబీ) పంటలకు విద్యుత్ గరిష్ఠ డిమాండ్ ఉండే అవకాశం ఉన్నందున.. తీసుకోవాల్సిన చర్యలపై విద్యుత్ అధికారులు సమావేశమయ్యారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ సమీక్ష నిర్వహించింది. జెన్కో-ట్రాన్స్కో సీఎండీ ప్రభాకరరావు అధ్యక్షతన ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అధికారులు 'తెలంగాణ విద్యుత్ రంగానికి పునరంకితం' అనే అంశంపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
మార్చి 2, 3 తేదీల్లో తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై అధికారులు చర్చించనున్నారు. ఈ అంశంపై విద్యుత్ సంస్థలు అనుసరించాల్సిన వ్యూహంపై మాట్లాడారు. నూతన విద్యుత్ కేంద్రాల నిర్మాణం పూర్తిచేసి.. మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని సీఎండీ సూచించారు.