ETV Bharat / state

Mask Fine: మాస్క్ పెట్టుకోలేదా అయితే ఫైన్​ కట్టేందుకు సిద్ధమవండి - Corona latest updates

Mask Fine: మాస్క్‌ ధరించకుండా వాహనం నడుపుతున్నారా? కారులో ఉన్నాం.. మాస్క్‌ లేకుంటే ఏంటి అని అనుకుంటున్నారా? ఇకపై ఇలా ఆలోచిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. కరోనా పెరుగుదలతో అప్రమత్తమైన ప్రభుత్వం... మాస్క్‌ తప్పక ధరించాలని సూచించింది. మాస్క్‌ లేకుండా బయట తిరిగితే.. పోలీసులు జరిమానా విధిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని మూడు కమిషనరేట్లలో కలిపి 10రోజుల్లో 34 వేల కేసులు నమోదు చేశారు.

Mask
Mask
author img

By

Published : Jan 11, 2022, 5:27 AM IST

Mask Fine: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో ఆంక్షలు కఠినతరం చేసిన సర్కారు... వైరస్‌ వ్యాప్తి కట్టడికి ప్రతిఒక్కరూ మాస్క్‌ తప్పకుండా ధరించాలని ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి... నిబంధనలు ఉల్లంఘిస్తున్నవారికి జరిమానా విధించడంతోపాటు కేసులు నమోదు చేస్తున్నారు.

మూడు కమిషనరేట్ల పరిధిలో...

10 రోజుల్లో గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో 34 వేల కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌ పరిధిలో 19వేల650, సైబరాబాద్ పరిధిలో 12వేల785, రాచకొండ పరిధిలో 18వందల 41 కేసులు నమోదు చేశారు. మాస్కులేకుండా వెళ్తున్న వారిపై ఒక్కొక్కరికి వెయ్యి జరిమానా విధిస్తున్నారు. ప్రధాన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు... మాస్క్‌ లేకుండా వెళ్తున్నవారి ఫొటోలు తీసి ఇంటికి ఈ-చలానాలను పంపిస్తున్నారు.

సీసీ కెమెరాలకు ప్రత్యేక సాఫ్ట్​వేర్...

ప్రత్యేక డ్రైవ్‌లలో కార్లు, బస్సులు, ద్విచక్రవాహనదారులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సీసీ కెమెరాలు... మాస్క్‌ లేకుండా వెళ్తున్నవారిని ఫొటోలు తీస్తున్నాయి. మాస్క్‌ సరిగా ధరించనివారిని గుర్తించేందుకు సీసీ కెమెరాలకు ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ అమర్చారు. ఈ కెమెరాలు మాస్క్‌ లేనివారిని గుర్తించి ఫొటోలు తీసి క్షణాల వ్యవధిలో ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌రూంకు పంపిస్తున్నాయి.

సీసీ కెమెరాలు చిత్రీకరించిన దృశ్యాలను పరిశీలించి... మాస్క్‌ లేకుండా, సీటు బెల్టు పెట్టుకోకుండా వెళ్తున్నవారిపై జరిమానాతో పాటు సీటు బెల్టు పెట్టుకోనందుకు కేసు నమోదు చేస్తున్నారు. ఇదే తరహాలో మాస్క్‌, హెల్మెట్‌ లేని ద్విచక్రవాహనదారులకు రెండు జరిమానాలు విధిస్తున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.