ETV Bharat / state

సీఎం కేసీఆర్​ వెంటే నడుద్దాం: తెలంగాణ ఎమ్మార్పీఎస్ - తెలంగాణ తాజా వార్తలు

దళితుల జీవితాల్లో వెలుగులునింపే దళితబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే దళిత జాతి ఉంటుందని తెలంగాణ ఎమ్మార్పీఎస్ ప్రకటించింది. దళితుల కన్నీళ్లు, కష్టాలను తొలగించేందుకు అద్భుతమైన పథకంతో ఆదుకున్నందుకు ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ను కలిసి కృతజ్ఞతలు తెలియజేసింది.

cm kcr
cm kcr
author img

By

Published : Jul 30, 2021, 10:35 PM IST

దేశ జనాభాలో 20 శాతంగా ఉన్న దళిత సమాజం ఇప్పటికీ అంటరానివారిగా వివక్షను ఎదుర్కొంటూ సామాజికంగా, ఆర్థింకగా అణచివేతకు గురవుతున్నారని తెలంగాణ ఎమ్మార్పీఎస్ పేర్కొంది. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ అమలుపరచబోతున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శం కానుందని చెప్పింది. దళితబంధు ప్రకటించిన సందర్భంగా తెలంగాణ ఎమ్మార్పీఎస్ ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది.

సీఎం కేసీఆర్​ బాటలో ఇతర రాష్ట్రాలు కూడా నడవాల్సిన అవసరముందన్నారు. దళితుల కష్టాలను మానవీయ కోణంలో సీఎం కేసీఆర్​ పరిశీలించారన్నారు. దళిత బంధు పథకం నిర్ణయాన్ని తామే స్వయంగా ప్రజల్లోకి తీసుకుపోతామన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి దళితుల అభివృద్ధికోసం సాహసోపేతమైన నిర్ణయాన్నితీసుకున్న కేసీఆర్​ వెంటే నడుద్దామని తెలంగాణ దళిత సమాజానికి వారు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: CM KCR Speech: 'కేసీఆర్ ఏదనుకుంటే అది కావాల్సిందే.. ఎలా ఆపుతారో నేనూ చూస్తా..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.