ETV Bharat / state

కేరళ రాష్ట్రంలో కరోనాతో తెలంగాణ వాసి మృతి - corona latest updates in telangana

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో కేరళలోని తిరువనంతపురంలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రాష్ట్రానికి చెందిన 68ఏళ్ల వృద్ధుడు అంజయ్య మృతితో కేరళలో కొవిడ్​ మృతుల సంఖ్య ఏడుకు చేరింది.

68-year-old man died with corona in kerala
కేరళ రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన తెలంగాణ వ్యక్తి
author img

By

Published : May 28, 2020, 11:50 PM IST

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందాడు. 68ఏళ్ల వృద్ధుడు అంజయ్య తన కుటుంబంతో కలిసి రాజస్థాన్​లోని జైపూర్ నుంచి ప్రత్యేక రైలులో తెలంగాణకు బయలుదేరాడు. కానీ ఓ రైలుకు బదులు తప్పుగా వేరే రైలు ఎక్కడం వల్ల మే 22న కేరళలోని తిరువనంతపురానికి చేరారు. సరైన పత్రాలు లేని కారణంగా అక్కడి అధికారులు వారిని పూజప్పురలోని ది ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ కోపరేటివ్​ మేనేజ్​మెంట్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్వారంటైన్​ కేంద్రానికి తరలించారు.

క్వారంటైన్​లో ఉన్న అంజయ్యకు కరోనా లక్షణాలు కనబడడం వల్ల అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరణానంతరం గురువారం అంజయ్య మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతడు కొవిడ్-19తో మృతిచెందినట్లు అధికారులు నిర్ధరించారు. అంజయ్య మృతితో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మృతదేహాన్ని తిరువనంతపురంలోని జనరల్​ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. కొవిడ్​ నిబంధనల ప్రకారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంజయ్య భార్య, ఇద్దరి పిల్లలతో పాటు బంధువులు కూడా పూజప్పురలోని క్వారంటైన్​ కేంద్రంలోనే ఉన్నారు.

ఇవీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సాగుతుందిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.