మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ను కులం పేరుతో దూషించిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ మాల మహానాడు, దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం ముందు ధర్నా చేశారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా..ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైనప్పటికీ.. ఇంకా అరెస్టు చేయకపోవడం పట్ల దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులపై దాడులు చేస్తే.. ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం సరికాదని.. అధిష్టానానికి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం దేనికి సంకేతమని తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దామోదర్ రెడ్డి ని అరెస్టు చేయాలని.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీ నుంచి ఆయనను తొలగించాలని... లేనిపక్షంలో గాంధీ భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి : పిల్లల అమ్మకాలకు ఏజెంట్ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి