ETV Bharat / state

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై వారంలోగా నిర్ణయం...

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై వారం రోజుల్లో తుదినిర్ణయం తీసుకోనున్నట్లు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తెజస జిల్లా కమిటీలు ప్రకటించాయని.. రాష్ట్ర కమిటీలో చర్చించిన తర్వాత పోటీపై ప్రకటన చేస్తానని స్పష్టం చేశారు.

Telangana Jana Samithi President kodandaram
తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం
author img

By

Published : Sep 24, 2020, 5:17 PM IST

నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై వారంలోగా తుది నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. మద్దతు కోసం తెరాస మినహా అన్ని రాజకీయ పక్షాలను కోరానన్న కోదండరాం.. ప్రజా సంఘాలనూ కలవనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని.. ఈ పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతుకలు కావాలని ప్రజలు కోరుతున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రెండు తీవ్రమైన సమస్యలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాని కోదండరాం అన్నారు. ఎల్​ఆర్​ఎస్ ద్వారా పేద, మధ్యతరగతి ప్రజల జేబులకు ప్రభుత్వం కత్తెర వేస్తుందోన్న తెజస అధ్యక్షుడు.. ఎల్​ఆర్​ఆస్​కు వ్యతిరేకంగా ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు చేయనున్నట్లు ప్రకటించారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ శుక్రవారం.. అఖిలభారత రైతు కూలీ సంఘం ఇచ్చిన పిలుపునకు మద్దతు ప్రకటించినట్లు కోదండరాం తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.