ETV Bharat / state

సీపీఎస్ విధానంతో ఉద్యోగులకే కాదు, ప్రభుత్వానికీ నష్టమే - ఐకాస నేత కారం రవీందర్​రెడ్డి

రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఐకాస నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్​లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తిరిగి రప్పించాలని కోరారు.

సీపీఎస్ విధానంతో ఉద్యోగులకే కాదు, ప్రభుత్వానికి నష్టమే
author img

By

Published : Jun 15, 2019, 5:29 PM IST

సీపీఎస్ విధానంతో ఉద్యోగులకే కాదు, ప్రభుత్వానికి నష్టమే

నాంపల్లి టీఎన్జీవో భవన్​లో తెలంగాణ ఉద్యోగుల ఐకాస సమావేశమైంది. గెజిటెడ్ అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. 12 వందల మంది తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రాకు కేటాయించారని, ఆంధ్రాకు చెందిన ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇరు ప్రభుత్వాలు ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్​ విధానంతో ప్రభుత్వానికి, ఉద్యోగులకు నష్టం తప్ప ప్రయోజనం లేదని, దీన్ని రద్దు చేసి రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలపాలని ఐకాస నేత కారం రవీందర్​రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్​ను కోరారు.

ప్రభుత్వం పరిపాలనలో భాగంగ చేపట్టే సంస్కరణలకు ఉద్యోగులు పూర్తిగా సహాకారం అందిస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకురాలు మమత తెలిపారు. 43 శాతం ఐఆర్‌తో పాటు పదవి విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచాలని కోరారు. వెల్‌నెస్‌ సెంటర్‌లను అన్ని జిల్లాల్లో విస్తృతంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి : పొట్ట కూటికోసం పోయి... పోలీసుల చెరలో చిక్కారు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.