ETV Bharat / state

Podu Lands Pattas : పోడు రైతులకు తీపికబురు.. త్వరలోనే పట్టాల పంపిణీ - podu lands pattas distribution in telangana

Podu Lands Pattas in Telangana : పోడుపట్టాల పంపిణీకి రాష్ట్రప్రభుత్వం సిద్ధమవుతోంది. దాదాపు 4 లక్షల ఎకరాల భూములకు పట్టాలు ఇవ్వనున్నారు. అఖిలపక్ష సమావేశాలు నిర్వహించిన అనంతరం..భవిష్యత్‌లో అటవీ ఆక్రమణలకు ఆస్కారం లేకుండా హామీ తీసుకొని పట్టాలు ఇవ్వనున్నారు.

Podu Lands Pattas
Podu Lands Pattas
author img

By

Published : May 6, 2023, 7:07 AM IST

Updated : May 6, 2023, 9:43 AM IST

4 లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలకు సర్వం సిద్ధం

Podu Lands Pattas in Telangana: పోడు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీపికబురు అందించబోతోంది. ఇక నుంచి పోడు భూముల వ్యవహారంలో ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా పరిష్కారం చూపేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే.. అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న సాగుదారుల్లో అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పట్టాలు పంపిణీ చేయనుంది. క్షేత్రస్థాయిలో వచ్చిన దరఖాస్తులను వివిధ స్థాయిల్లో సభలు నిర్వహించి పరిశీలించారు. చట్టం, నిబంధనలకు లోబడి ఉన్న దరఖాస్తులను ఆమోదించారు. 360 కోణంలో అన్ని అంశాలను పరిశీలించారు. నిర్దిష్ట గడువుకు ముందు వరకు సాగు చేసుకుంటున్న వారి దరఖాస్తులను మాత్రమే ఆమోదించారు.

Podu Lands Pattas Distribution: 2005 వరకు మూడు తరాలుగా పోడు సాగు చేసుకుంటున్నట్లు ఆధారాలు చూపాల్సి ఉంటుంది. అంటే 2023 వరకు 93 ఏళ్ల ఆధారాలు చూపాల్సి ఉంటుంది. ఇందుకోసం గూగుల్ చిత్రపటాలు సహా అన్నింటినీ పరిశీలించారు. గతంలో పట్టాలు పొందిన వారిని, అర్హత లేని, సరైన ఆధారాలు లేని వాటిని ఆమోదించలేదు. మొత్తంగా 1,55,000 లబ్దిదారుల దరఖాస్తులను అర్హత ఉన్నవిగా గుర్తించారు. దాదాపు నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణం మేరకు పోడు పట్టాలను సిద్దం చేశారు.

కొత్తసచివాలయం ప్రారంభోత్సవం రోజు సంతకం: కొత్తసచివాలయం ప్రారంభోత్సవం రోజు పోడుపట్టాల పంపిణి దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతకం చేశారు. త్వరలో పోడు పట్టాలు పంపిణీచేస్తామని పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. సంతకం చేసిన ఆరు దస్త్రాల్లో పోడు పట్టాల దస్త్రం కూడా ఉంది. అందుకు అనుగుణంగా త్వరలోనే పోడు పట్టాల పంపిణీ జరగనుంది. నెలాఖర్లోపు ప్రక్రియ జరిగే అవకాశం కనిపిస్తోంది. పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.

పట్టాల పంపిణీ అనంతరం ఒక్క ఎకరా అడవి కూడా ఆక్రమణకు గురి కారాదు: ఉమ్మడి ఆదిలాబాద్ లేదా ఉమ్మడి వరంగల్ జిల్లాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. అయితే పట్టాల పంపిణీకి ముందు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. అందరిని సమావేశపరిచి భవిష్యత్​లో అటవీ ప్రాంతంలో ఆక్రమణలు జరగకుండా చూడడంతో పాటు స్థానికుల నుంచి హామీ తీసుకుంటారు. పోడు పట్టాల పంపిణీ అనంతరం ఒక్క ఎకరా అడవి కూడా ఆక్రమణకు గురి కారాదన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. అందుకు అనుగుణంగా పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు స్థానికులను కూడా అందులో భాగస్వామ్యం చేయనున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 6, 2023, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.