ETV Bharat / state

Telangana Tax Revenue : అంచనాలు దాటిన రాష్ట్ర పన్ను ఆదాయం.. ఎంతంటే? - Telangana Tax Revenue 2023

Telangana Tax Revenue : పన్ను ఆదాయం అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో వంద శాతం అధిగమించింది. బడ్జెట్ అంచనా కంటే రూ.11 కోట్లు ఎక్కువగానే ఖజానాకు పన్నుల ద్వారా సమకూరాయి. రాబడులు రూ.1.60 లక్షల కోట్ల వరకు ఉండగా.. రూ.1.70 లక్షల కోట్ల వ్యయం చేసింది. రూ.32,000 కోట్లు కొత్త రుణాలు తీసుకున్న సర్కార్.. రూ.21,000 కోట్లు అప్పులు, వడ్డీలకు చెల్లింపులు చేసింది.

Telangana government
Telangana government
author img

By

Published : May 20, 2023, 7:59 AM IST

అంచనాలు దాటిన తెలంగాణ పన్ను ఆదాయం.. ఎంతంటే?

Telangana Tax Revenue : రాష్ట్ర సర్కార్ 2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పన్ను అంచనాలను పూర్తిగా అందుకుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్‌కు ప్రభుత్వం అందించిన వివరాలు ఆదాయ, వ్యయాలను వెల్లడించాయి. 2022-23లో పన్నుల రూపంలో రూ.1,26,606 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తే.. రూ.1,26,617 కోట్లు ఖజానాకు సమకూరాయి. అంచనా కంటే రూ.11 కోట్ల పన్నుఆదాయం ఎక్కువగా వచ్చింది.

Telangana Tax Revenue 2022-23 : జీఎస్టీ ద్వారా రూ.41,888 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.14,228 కోట్లు.. అమ్మకం పన్ను ద్వారా రూ.29,604 కోట్లు వచ్చాయి. ఎక్సైజ్ పన్నుల ద్వారా రూ.18,470 కోట్లు.. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.13,994 కోట్లు సమకూరాయి. ఇతర పన్నుల నుంచి మరో రూ.8 430 కోట్లు వచ్చాయి. ఎక్సైజ్, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, ఇతర అంచనాలను మించాయి. పన్నేతర ఆదాయం అంచనాల్లో 77 శాతం మేర రూ.19,553 కోట్ల రూపాయలు ఖజానాకు వచ్చాయి.

Telangana Tax Revenue Target Reached : కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు మాత్రం అంచనాలను మూడో వంతు కూడా చేరుకోలేదు. రూ.41,000 కోట్లు గ్రాంట్ల రూపంలో వస్తాయని అంచనా వేస్తే.. అందులో కేవలం 32 శాతం రూ.13,179 కోట్లు సమకూరాయి. మొత్తంగా రెవెన్యూ రాబడి అంచనా అయిన రూ.1,93,039 కోట్లలో.. 83 శాతం రూ.1,59,349 కోట్లు ఖజానాకు చేరింది.

2022-23లో రాష్ట్ర ప్రభుత్వం రూ.32,119 కోట్లను రుణాల ద్వారా సమీకరించుకుంది. వాస్తవానికి బడ్జెట్‌లో రూ.52,167 కోట్ల అప్పు ప్రతిపాదించినప్పటికీ కేంద్రం పూర్తిగా అనుమతించలేదు. దీంతో తక్కువ మొత్తంలోనే రుణాలు తీసుకోవాల్సి వచ్చింది. 2022-23లో అప్పులు, వడ్డీల చెల్లింపుల కోసం సర్కార్ రూ.21,248 కోట్లు ఖర్చు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో చేసిన మొత్తం వ్యయం రూ.1,70,849 కోట్లు. ఇది బడ్జెట్ అంచనా అయిన రూ.2,19,003 కోట్లలో 78 శాతంగా ఉంది.

అందులో రెవెన్యూ వ్యయం రూ.1,52,841 కోట్లు కాగా.. మూలధన వ్యయం18007 కోట్లు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన రెవెన్యూ వ్యయం అంచనాను 81 శాతం.. మూలధన వ్యయం అంచనాను 61 శాతం చేరుకొంది. గత ఆర్థిక సంవత్సరంలో వేతనాల కోసం రూ.35,266 కోట్లు, పింఛన్ల కోసం రూ.15,816 కోట్లు, రాయితీల కోసం రూ.9,628 కోట్లు ఖర్చు చేశారు.

రంగాల వారీగా చూస్తే 2022-23లో రాష్ట్ర ప్రభుత్వం సాధారణ రంగంపై రూ.50,362 కోట్లు.. సామాజిక రంగంపై రూ.60,475 కోట్లు, ఆర్థిక రంగంపై రూ.60,011 కోట్లు ఖర్చు చేసింది. రూ.6,508 కోట్ల రెవెన్యూ మిగులు..రూ.32,119 కోట్ల ఆర్థిక లోటు చూపారు. రూ.11,166 కోట్ల నికర లోటు ఉన్నట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.