ETV Bharat / state

రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు వేగవంతం - తెలంగాణ తాజా వార్తలు

రాష్ట్ర బడ్జెట్ కసరత్తు వేగవంతం కానుంది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చే నిధులు, గ్రాంట్లపై స్పష్టత వచ్చింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసులతో.. రానున్న ఐదేళ్లకు రాష్ట్రానికి వచ్చే మొత్తం కూడా వెల్లడైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. ఇప్పటికే 10 నెలలు గడిచిన నేపథ్యంలో వాటిని బేరీజు వేసుకుంటూ బడ్జెట్ కసరత్తు చేయనున్నారు.

TELANGANA BUDGET
రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తును వేగవంతం
author img

By

Published : Feb 3, 2021, 5:42 AM IST

రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు వేగవంతం

కేంద్ర వార్షిక బడ్జెట్​తో రాష్ట్రానికి వచ్చే నిధుల విషయంలో స్పష్టత వచ్చింది. కేంద్రం చేసిన కేటాయింపుల ప్రకారం రాష్ట్రానికి ఏ మేరకు నిధులు వస్తాయన్న విషయమై అధికారులు ఓ అంచనాకు వచ్చారు. బడ్జెట్​లో కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న ప్రాధాన్యతలు, రాష్ట్రంపై వాటి ప్రభావం ఎంత ఉంటుందన్న విషయమై కొంత అవగాహనకు వచ్చారు.

గ్రాంట్ల విషయంలో స్పష్టత..

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆమోదంతో పన్నుల్లో రాష్ట్ర వాటాతో పాటు.. రానున్న ఐదేళ్ల కాలానికి కేంద్రం నుంచి వివిధ రూపాల్లో వచ్చే నిధులు, గ్రాంట్ల విషయంలో స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తును ఆర్థికశాఖ వేగవంతం చేయనుంది. కొవిడ్, లాక్‌డౌన్ నేపథ్యంలో భారీగా పడిపోయిన ఆదాయాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. డిసెంబర్, జనవరి నెలల్లో ఖజానాకు రాబడి బాగానే ఉంది. ఎక్సైజ్, జీఎస్టీ, అమ్మకం పన్ను బాగానే రాగా.. రిజిస్ట్రేషన్ల ఆదాయం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ఆదాయ, వ్యయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఓ అవగాహనకు వచ్చింది.

బడ్జెట్​పై కరోనా ప్రభావం..

కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి.. 54 వేల కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గిందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆ ప్రభావం బడ్జెట్​పై పడనుంది. డిసెంబర్, జనవరి నెలల్లో రాబడులు పెరిగినందున ఆ గణాంకాలను పరిగణలోకి తీసుకొని రానున్న ఆర్థిక సంవత్సరానికి అంచనాలను రూపొందించే అవకాశం ఉంది. ఆదాయాలు పడిపోయిన వేళ రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణ కోసం.. రుణాలపై ఆధారపడింది.

అదనపు రుణం..

వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీఎస్​డీపీలో నాలుగు శాతం.. కొన్ని షరతులతో మరో అరశాతం మొత్తాన్ని రుణంగా తీసుకునేందుకు కేంద్రం అనుమతించింది. కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో జీఎస్​డీపీ రెండు శాతం మేర తగ్గే అవకాశం ఉందని.. కేంద్ర ఆర్థికశాఖ అంచనా వేసింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీఎస్​డీపీ అంచనా కోసం డిసెంబర్ నెల గణాంకాల ఆధారంగా జీఎస్​డీపీని అంచనా వేసేందుకు అర్థిక గణాంక శాఖ కసరత్తు చేస్తోంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని.. రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తును వేగవంతం చేయనున్నారు.

ఇవీచూడండి: విన్నపాలు బుట్టదాఖలు.. రాష్ట్రాన్ని నిరుత్సాహపరిచిన కేంద్ర బడ్జెట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.