ETV Bharat / state

Diagnostic centres: రాష్ట్రంలో అందుబాటులోకి 19 డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు - telangana varthalu

పేద ప్రజలకు వైద్య పరీక్షలు భారం కాకూడదనే లక్ష్యంతో.. ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్లు( Diagnostic centres) 19జిల్లాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఆయా చోట్ల మంత్రులు, ముఖ్యనేతలు వైద్యపరీక్షా కేంద్రాలను ప్రారంభించారు. రక్త, మూత్ర, గుండె, కిడ్నీ సంబంధిత జబ్బులతో పాటు... అత్యంత ఖరీదైన పరీక్షలూ... తెలంగాణ డయాగ్నోస్టిక్‌ సెంటర్లతో పేదలకు చేరువ కానున్నాయి.

Diagnostic centres
రాష్ట్రంలో అందుబాటులోకి 19 డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు
author img

By

Published : Jun 9, 2021, 8:25 PM IST

రాష్ట్రంలో అందుబాటులోకి 19 డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు

రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఉచిత డయాగ్నోస్టిక్‌ సెంటర్లకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 19జిల్లాల్లో బుధవారం ఈ పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఆయా జిల్లాల మంత్రులు, ముఖ్యనేతలు వీటిని ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటతోపాటు జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఉచిత వైద్యపరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్లతోపాటు..., వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సేవలు ప్రారంభమయ్యాయి.

ప్రారంభించిన మంత్రులు, ముఖ్య నేతలు

నల్గొండలో డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి జగదీశ్‌ రెడ్డి... తెరాస పాలనలో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. జోగులాంబ గద్వాలలో ఉచిత వైద్యపరీక్షల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్‌రెడ్డి.. ప్రజలకు ఏది అవసరమో అది చేరువ చేసేందుకే ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఖమ్మంలో ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి పువ్వాడ అజయ్‌ కుమార్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ప్రారంభించారు. వైద్యం కంటే ఖరీదైపోతున్న వైద్యపరీక్షలను ప్రభుత్వం పేదలకు చేరువ చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్‌లో పేర్కొన్నారు. ములుగులో మంత్రి సత్యవతి రాఠోడ్‌ డయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వైద్యపరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు. సంగారెడ్డిలో డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు.. అతిత్వరలో మరో 16 సెంటర్లు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.

అన్ని రకాల టెస్టులు

కొత్తగా ప్రారంభించిన డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో.. కరోనా పరీక్షలతోపాటు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించనున్నారు. బీపీ, షుగర్‌, గుండె జబ్బు, ఎముకల వ్యాధులు, కాలేయం, కిడ్నీ, థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన టెస్టులు చేస్తారు. ఈ డయాగ్నోస్టిక్‌ కేంద్రాల్లో పూర్తి ఆటోమేటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్, ఆటోమేటిక్ ఇమ్యునో అస్సే అనలైజర్, ఫైవ్ పార్ట్స్ సెల్ కౌంటర్, ఎలీసా రీడర్ అండ్ వాషర్, ఆటోమేటిక్ యూరిన్ అనలైజర్ వంటి అత్యాధునిక సాంకేతికతో కూడిన రోగ నిర్ధరణ పరీక్షా యంత్రాలున్నాయి. ఈసీజీ, టూడీ ఈకో, ఆల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్‌రే వంటి ఇమేజింగ్ పరీక్షా యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు సీటీ స్కానింగ్‌ యంత్రాలనూ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. పరీక్షల తీరును అనుసరించి ఒక్కో యంత్రం.. గంటకు 400 నుంచి 800 రిపోర్టులను.. అత్యంత కచ్చితత్వంతో అందజేస్తాయని వైద్యాధికారులు చెబుతున్నారు. పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన పాథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, రేడియాలజిస్టులు సహా అర్హులైన ఇతర సాంకేతిక సిబ్బందిని డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో అందుబాటులో ఉంచుతున్నారు.

పీహెచ్​సీలో నమూనాల సేకరణ

పీహెచ్​సీలో రోగి నమూనాలు సేకరించి... ఈ డయాగ్నోస్టిక్‌ సెంటర్లకు పంపేలా జిల్లాల్లో ఏర్పాట్లు చేశారు. ఒక్కరోజులోనే ఆయా పరీక్షల నివేదికలను సెల్‌ఫోన్‌ ద్వారా బాధితులకు తెలియజేసేలా చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: 'కరోనాపై 'సర్జికల్ స్ట్రైక్' చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.