ETV Bharat / state

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు రిజర్వాయర్ల నిర్మాణంలో పరిహారం, పునరావాసానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట
author img

By

Published : Sep 1, 2020, 10:33 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు రిజర్వాయర్ల నిర్మాణంలో పరిహారం, పునరావాసానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని.. మరోకేసులో కొన్ని కుటుంబాలను బలవంతంగా ఖాళీ చేయించారని ఆరోపణలు ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

అనంతగిరి, రంగనాయక సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల ముంపు బాధితులు, భూ నిర్వాసితులకు పరిహారం, పునరావాసంపై హైకోర్టు ఇచ్చిన ఆయా తీర్పులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. వందలాది మంది రైతులను ప్రతివాదులుగా చేర్చిన ఈ పిటిషన్లను జస్టిస్ ఏఏం ఖన్విల్కర్ ధర్మాసనం విచారించింది.

హైకోర్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోలేదని.. మరికొన్ని అంశాలు సరిగా అన్వయించుకోలేదని తెలంగాణ తరఫు న్యాయవాది వెంకట్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రతివాదులకు కౌంటర్ దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువున ఇచ్చిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణ అయ్యే వరకు హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తున్నట్లు పేర్కొంది. తదుపరి విచారణ 5 వారాలకు వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.