ETV Bharat / state

నేషనల్ హెల్త్ అథారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం - నేషనల్ హెల్త్ అథారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

నేషనల్ హెల్త్ అథారిటీ
నేషనల్ హెల్త్ అథారిటీ
author img

By

Published : May 18, 2021, 7:36 PM IST

Updated : May 18, 2021, 8:52 PM IST

19:34 May 18

నేషనల్ హెల్త్ అథారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారుచేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆరోగ్య యోజన- ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో చేరాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే నిర్ణయించారు. అందుకు అనుగుణంగా నేషనల్‌ హెల్త్‌ అథారిటీతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు సీఈవోకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ మెమో జారీ చేశారు.

ఆయుష్మాన్‌ భారత్ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో రాంచీలో లాంఛనంగా ప్రారంభించారు. అయితే, అంతకు ముందు ఆగస్టులోనే హరియాణాలోని కర్నాల్‌లో జన్మించిన కరిష్మా అనే బాలికనుఈ పథకం మొదటి లబ్ధిదారుగా చెబుతారు. ఈ పథకం కింద పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు చికిత్స ఉచితం. దీని కింద దేశవ్యాప్తంగా 20 వేలకు పైగా ఆసుపత్రులలో 1000 కి పైగా వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 3,982 కరోనా కేసులు, 27 మరణాలు

Last Updated : May 18, 2021, 8:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.